నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ మరోసారి కాల్పులకు తెగబడింది. తెల్లవారుజామున 2.30 గంటలకు జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్, కతువా జిల్లాల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించినట్లు భారత సైన్యాధికారులు తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతమైన హిరణ్సాగర్ సెక్టార్‌లోనూ మోర్టార్ షెల్స్, ఆయుధాలతో పాక్ దాడికి పాల్పడిందని పేర్కొన్నారు.
" మాన్‌కోట్ సెక్టార్లో... తెల్లవారుజామున 2.30 గంటలకు మోర్టార్ షెల్స్, ఆయుధాలతో పాకిస్థాన్ దాడికి దిగింది. పాక్ చర్యకు భారత సైన్యం దీటుగా బదులిచ్చింది".