దిల్లీలోని లక్ష్మీనగర్‌లో పట్టుబడిన మహ్మద్ అష్రఫ్ అనే పాకిస్థాన్ ఉగ్రవాదికి 14 రోజుల రిమాండ్ విధించింది దిల్లీ కోర్టు. దేశ రాజధానిలో(Terrorist Attack in Delhi) ఉగ్రముఠాలు దాడులు నిర్వహించే అవకాశం ఉందన్న హెచ్చరికలనేపథ్యంలో దిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల(Delhi Police) తనిఖీల్లో ఈ ఉగ్రవాది పట్టుబడ్డాడు. అతని నివాసం నుంచి నుంచి ఏకే-47 సహా.. ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. అష్రఫ్‌ను పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతను కొన్నిరోజులుగా నకిలీ గుర్తింపు కార్డుతో దిల్లీలోనే ఉంటున్నట్లు కోర్టుకు తెలిపారు.
దిల్లీలో పట్టుబడ్డ పాక్ ఉగ్రవాదికి 14 రోజుల రిమాండ్ - దిల్లీలో ఉగ్రకుట్ర భగ్నం
దిల్లీలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో అరెస్టయిన పాకిస్థానీ ఉగ్రవాది మహ్మద్ అష్రఫ్‌కు 14 రోజుల పోలీసు కస్టడీని విధించింది దిల్లీ కోర్టు. అష్రఫ్ నకిలీ గుర్తింపు కార్డుతో కొన్నాళ్లుగా దిల్లీలో నివసిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.
రిమాండ్
పండుగల సమయంలో ఉగ్రకుట్రలకు అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో రాజధానిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత సోదాలు చేస్తున్నారు. దిల్లీలోని అద్దెదారులు, కార్మికుల ధ్రువీకరణకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. కమ్యూనిటీ పోలీసింగ్‌పై దృష్టి సారించారు.
ఇవీ చదవండి: