Pathankot Attack Terrorist: పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి కేసులో నిందితుడు, పాకిస్థాన్ జాతీయుడైన అలీ కసిఫ్ జాన్‌ను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. గత ఐదు రోజుల వ్యవధిలో కేంద్రం ముగ్గురిని ఉగ్రవాదులుగా ప్రకటించగా.. వీరిలో జాన్ అలియాస్ జాన్ అలీ కసిఫ్ మూడో టెర్రరిస్టు కావడం గమనార్హం. ప్రభుత్వం టెర్రరిస్టుగా ప్రకటించిన 34వ వ్యక్తి అలీ కసిఫ్ జాన్. ఎన్‌ఐఏ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పలు కేసుల్లో జాన్ నిందితుడిగా ఉన్నాడు. పాక్‌కు చెందిన ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ శిబిరాల నుంచి భారత్‌లో దాడులకు జాన్ ప్రణాళికలు వేసి.. వాటిని సమన్వయం చేస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఉగ్రశిక్షణ కోసం క్యాడర్ నియామకంలోనూ పాల్గొంటున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
పఠాన్ కోట్ సూత్రధారిని ఉగ్రవాదిగా ప్రకటించిన హోంశాఖ - Attack Terrorist
Pathankot Attack Terrorist: 2016లో జమ్ముకశ్మీర్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడిలో నిందితుడు, పాకిస్థాన్ జాతీయుడు అలీ కసిఫ్ జాన్‌ను మంగళవారం కేంద్ర ప్రభుత్వం.. ఉగ్రవాదిగా ప్రకటించింది. ఉగ్రశిక్షణ కోసం అతడు క్యాడర్ నియామకంలోనూ పాల్గొంటున్నట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది.
DEL71-MHA-LD TERRORIST
కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించిన అలీ కసిఫ్ జాన్... జనవరి 30, 1982న జన్మించాడు. 2016 జనవరిలో పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు భద్రతా సిబ్బందితో పాటు ఒక పౌరుడు అమరులైన ఘటన దేశంలో విషాదం నింపింది. మరోవైపు, పుల్వామా దాడిలో నిందితుడు, పాకిస్థాన్ జాతీయుడైన మొహియుద్దీన్ ఔరంగజేబ్ ఆలంగీర్‌ను కేంద్ర ప్రభుత్వం నిన్న(మంగళవారం) ఉగ్రవాదిగా ప్రకటించింది.
ఇదచదవండి:అన్న కుటుంబాన్ని హతమార్చిన తమ్ముడు