Pakistani Girl Married Indian : బంగాల్లోనికోల్కతాకు చెందిన సమీర్ ఖాన్ జర్మనీలో చదువుకున్నాడు. 2018లో భారత్‌కు వచ్చినప్పుడు తన తల్లి ఫోన్‌లో పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన జావెరియా ఖనుమ్ ఫొటో చూశాడు. వెంటనే ఆ పాక్ యువతిపై మనసు పారేసుకున్నాడు. పెళ్లంటూ చేసుకుంటే తననే చేసుకుంటానని పట్టుబట్టాడు. తల్లిదండ్రులు అంగీకరించినా వారికి కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. భారత్‌కు వచ్చేందుకు రెండుసార్లు జావెరీ ఖనుమ్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆమె వీసా రిజక్ట్ అయ్యింది. ఈ మధ్యలో కొవిడ్ వచ్చింది. మొత్తం ఐదేళ్లు అలా గడిచిపోయాయి. ఎట్టకేలకు 45 రోజుల గడువుతో జావెరియా ఖనుమ్‌కు భారత్ వీసా దక్కింది. వాఘా-అటారీ అంతర్జాతీయ సరిహద్దు గుండా ఆ పాక్ యువతి భారత్‌లోకి అడుగుపెట్టింది. బాజా భజంత్రీల మధ్య ఆమెకు సమీర్‌ఖాన్ కుటుంబం స్వాగతం పలికింది.
"ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. రావటంతోనే చాలా ప్రేమ పంచుతున్నారు. 5 సంవత్సరాల తర్వాత ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నాము. వచ్చే జనవరి మొదటి వారంలో మా వివాహం."
- జావెరియా ఖనుమ్ పాక్ యువతి
తనకు కాబోయే భార్యకు వీసా మంజూరు చేయడంపై సమీర్‌ఖాన్ భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ ఐదేళ్లు ఒకరికొకరం ఎంతో మిస్ అయ్యామని అన్నాడు.
"ఈ జనవరిలో మా వివాహం నిశ్చయమైంది. భారత ప్రభుత్వానికి, పాకిస్థాన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. అలాగే మక్భూలీ మాజీకి కృతజ్ఞతలు. ఈ ప్రక్రియలో మీరందరు అండగా నిలిచారు."
- సమీర్ ఖాన్, కోల్‌కతా వాసి