పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్.. భారత్ గగనతలంలోకి ప్రవేశించడం కలకలం రేపింది. దాన్ని గుర్తించిన సరిహద్దు భద్రతా సిబ్బంది కాల్పులు జరపగా.. వెనక్కి వెళ్లిపోయిందని అధికారులు తెలిపారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లా డిండా పోస్ట్ వద్ద పాక్ సరిహద్దు నుంచి వస్తున్న డ్రోన్‌ను బీఎస్ఎఫ్ జవాన్లు ఆదివారం గమనించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది డ్రోన్ వస్తున్న దిశగా కాల్పులు జరిపారు.
దీంతో ఆ డ్రోన్ వెనక్కి మళ్లినట్లు వారు చెప్పారు. డ్రోన్ నుంచి ఏమైనా జారవిడిచారనే అనుమానంతో అది వచ్చిన మార్గంలో గాలింపు జరిపామని.. అయితే ఎలాంటి వస్తువు దొరకలేదని తెలిపారు.