తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దులో పాక్​ డ్రోన్​ కూల్చివేత.. నలుగురు ఉగ్ర అనుచరుల అరెస్ట్​

Pakistani drone shot down
Pakistani drone BSF

By

Published : Mar 7, 2022, 11:10 AM IST

Updated : Mar 7, 2022, 11:25 AM IST

10:17 March 07

పంజాబ్​ ఫిరోజ్​పుర్​ సెక్టార్​లో పాక్​ డ్రోన్​ కూల్చివేత

బీఎస్​ఎఫ్​ కూల్చివేసిన పాక్ డ్రోన్

పంజాబ్​ ఫిరోజ్​పుర్​ సెక్టార్​లోని అంతర్జాతీయ సరిహద్దులో సోమవారం ఓ పాకిస్థాన్​ డ్రోన్​ను కూల్చివేసింది సరిహద్దు భద్రతా దళం (బీఎస్​ఎఫ్). అందులో 4కేజీల నిషేధిత వస్తువులు ఉన్నట్లు ఓ అధికారి వెల్లడించారు.

తెల్లవారుజామున 3గంటల సమయంలో డ్రోన్​ శబ్దానికి అప్రమత్తమై.. దానిని గురిపెట్టేందుకు పారా బాంబులను ఉపయోగించి ఆ ప్రాంతాన్ని ప్రకాశవంతం చేసినట్లు బీఎస్​ఎఫ్​ అధికార ప్రతినిధి తెలిపారు. డ్రోన్​కు ఓ చిన్న ఆకుపచ్చ సంచి ఉందని, అందులో పసువు రంగులో నాలుగు ప్యాకెట్లు, ఓ నలుపు ప్యాకెట్​ ఉన్నాయని వెల్లడించారు.

ఉగ్రకుట్ర భగ్నం..

జమ్ముకశ్మీర్​లోని అవంతిపొరలో ఉగ్రకుట్రను భగ్నం చేశారు పోలీసులు. జైషే మహ్మద్​ ఉగ్రసంస్థకు చెందిన నలుగురు ఉగ్ర సహచరులను అరెస్టు చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం సహా ఆయుధాల తరలింపులో వీరు సహకరించినట్లు అధికారులు తెలిపారు.

గ్రెనేడ్​ దాడిలో మరొకరు మృతి

శ్రీనగర్​లోని అమిరా కడల్​ ప్రాంతంలో ఆదివారం జరిగిన గ్రెనేడ్​ దాడిలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. ఈ ఘటనలో 23 మంది పౌరులు సహా ఓ పోలీసు గాయపడ్డారు. గాయపడిన ఓ పౌరుడు చికిత్స పొందుతూ ఆదివారమే మృతిచెందాడు. ఈ దాడికి సంబంధించి కొన్ని కీలకమైన ఆధారాలు లభించాయని, నేరస్థులను అరెస్టు చేయడం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ల కలకలం.. పాక్​ పనేనా?

Last Updated : Mar 7, 2022, 11:25 AM IST

ABOUT THE AUTHOR

...view details