Pakistan withdrawal Chess Olympiad: భారత్‌లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న చెస్ ఒలింపియాడ్ నుంచి పాకిస్థాన్ వైదొలిగింది. ఈవెంట్ ప్రారంభమైన తర్వాత నుంచి వైదొలుగుతున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. 'ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ఈవెంట్‌ను పాకిస్థాన్.. రాజకీయం చేయడం దురదృష్టకరం. వారి జట్టు భారత్‌కు చేరుకున్న తర్వాత.. అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది' అని విదేశాంగ శాఖ వివరించింది.
చెన్నై 'చెస్ ఒలింపియాడ్' నుంచి పాక్ ఔట్.. 'అంతా రాజకీయం!' - చెస్ ఒలింపియాడ్ పాకిస్థాన్ ఔట్
Chess Olympiad Pakistan: భారత్‌లో జరుగుతున్న చెస్ ఒలింపియాడ్ నుంచి పాక్ వైదొలిగింది. వారి జట్టు ఇక్కడకు చేరుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అంతర్జాతీయ ఈవెంట్‌ను సైతం పాకిస్థాన్ రాజకీయం చేస్తోందని భారత విదేశాంగ శాఖ మండిపడింది.
Pakistan withdrawal Chess Olympiad
ఒలింపియాడ్ టార్చ్ రిలే జమ్ము కశ్మీర్ మీదుగా సాగడాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్థాన్ ఈవెంట్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై విలేకరులు ప్రశ్నించగా విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి.. పాక్ లక్ష్యంగా ఘాటుగా స్పందించారు. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు.