ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేందుకు పాకిస్థాన్ పెద్ద మొత్తంలో (news kashmir drugs) డ్రగ్స్‌ను తరలిస్తోందన్నారు జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్. ఓ ప్రణాళిక ప్రకారం మాదకద్రవ్యాలను రవాణా చేసి స్థానిక యువతను అందుకు బానిసలను చేస్తోందని ఆరోపించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, జమ్ముకశ్మీర్ పోలీస్ (news kashmir drugs) సంయుక్తంగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన దిల్బాగ్.. ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రవాదుల నిధుల కోసం పాక్ కుట్ర- భారత్‌కు డ్రగ్స్ సరఫరా - జమ్ముకశ్మీర్ వార్తలు తాజా
ఉగ్రవాదులకు నిధులు అందించేందుకే పాకిస్థాన్ జమ్ముకశ్మీర్‌లో (news kashmir drugs) డ్రగ్స్ సరఫరా చేస్తోందన్నారు డీజీపీ దిల్బాగ్ సింగ్. కుట్రలు ఫలించేందుకు పాక్ స్థానిక యువతను బలిచేస్తోందన్నారు.
పాకిస్థాన్
జాజర్ కొట్లీలో గురువారం పట్టుబడ్డ 52 కేజీల హెరాయిన్ సహా ఇటీవల పూంచ్, బారాముల్లా, కుప్వారా వంటి సరిహద్దు ప్రాంతాల్లో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. ఈ ఘటనలను ఉద్దేశిస్తూ దిల్బాగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కుట్రలు ఫలించేందుకు పాక్ స్థానిక యువతను బలిచేస్తోందని దిల్బాగ్ పేర్కొన్నారు. డ్రగ్స్ రవాణాను కట్టడి చేసేందుకు పోలీసులు మరింత సమర్థవంతంగా పనిచేయాలన్నారు.
ఇదీ చూడండి :సుక్మా అడవుల్లో ఎదురుకాల్పులు.. నక్సల్ కమాండర్ హతం