నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పాకిస్థాన్ అలజడులు సృష్టించే అవకాశం ఉందని.. ఎక్స్‌వీ కార్ప్స్కు నాయకత్వం వహిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు హెచ్చరించారు. తమ దేశ అంతర్గత సమస్యల నుంచి సొంత ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలా చేసే అవకాశముందని వెల్లడించారు. 'చొరబాట్లకు ప్రస్తుత శీతకాలం అనువైన సమయం. భారత్‌లోకి ప్రవేశించడానికి 200 నుంచి 250 మంది ఉగ్రవాదులు సరిహద్దుల్లో వేచి ఉన్నారు. అందుకు సంబంధించి మాకు సమాచారం అందింద'ని పేర్కొన్నారు.
చొరబాట్లకు అనుకూలంగా ఉన్న కశ్మీర్, పీర్ పంజాల్ శ్రేణి దక్షిణ ప్రాంతాలలో సైనికుల పహారా ఎక్కువగా ఉన్నట్లు ఆర్మీ కమాండర్ వెల్లడించారు. పాక్.. కాల్పుల విరమణకు పాల్పడే అవకాశమూ లేకపోలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
పాకిస్థాన్‌లో కొంతకాలంగా రాజకీయ అశాంతి నెలకొంది. ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం వచ్చే నెల 31లోపు అధికారం నుంచి తప్పుకోవాలని 11 పార్టీల విపక్ష కూటమి హెచ్చరించిన నేపథ్యంలో లెఫ్టినెంట్ జనరల్ ఈ వ్యాఖ్యలు చేశారు.