ఉగ్రవాదం నుంచి విముక్తి పొందిన వాతావరణాన్ని కల్పించడం సహా భారత్‌తో శత్రుత్వాన్ని తొలగించాల్సిన బాధ్యత పాకిస్థాన్‌పైనే ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్‌తో శాంతికి పాకిస్థాన్ అన్ని వైపుల నుంచి మార్గాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందంటూ ఆ దేశ సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ ఖమర్ జావెద్ బజ్వా ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేంద్రం ఈ ప్రకటన చేసింది.
పాకిస్థాన్‌తో తాము సాధారణ పొరుగుదేశ సంబంధాలను కోరుకుంటున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వెల్లడించారు.