Pakistan drone shot down: జమ్ముకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో మరోమారు డ్రోన్ కలకలం సృష్టించింది. కథువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు గుండా భారత్కులోకి ప్రవేశించిన ఓ డ్రోన్‌ను ఆదివారం ఉదయం కూల్చివేశాయి భద్రతా బలగాలు. పాకిస్థాన్‌కు చెందిన ఆ డ్రోన్ ఆయుధాలతో సరిహద్దు దాటినట్లు తెలిపాయి. రాజ్‌బాఘ్ పోలీస్ స్టేషన్ పరిధి, తాలి హరియా చాక్ సరిహద్దుల్లో డ్రోన్ ఎగురుతుండటం కనిపించిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కాల్పులు జరిపినట్లు జమ్ముకశ్మీర్ పోలీసు ప్రతినిధి తెలిపారు.
"ఆదివారం ఉదయం సరిహద్దుల్లో డ్రోన్ సంచారాన్ని గమనించిన పోలీసులు భారత్‌లోకి ప్రవేశించగానే దానిపై కాల్పులు జరిపారు. వెంటనే కుప్పకూలిపోయింది. పెద్ద బాక్సును మోసుకోస్తున్నట్లు గుర్తించాం. దానిని బాంబు నిర్వీర్య బృందం పరిశీలించింది. "
- ఎస్ఎస్పీ కథువా.
డ్రోన్ మోసుకొచ్చిన పెద్ద బాక్సులో 7యూబీజీఎల్(అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లు), 7 మ్యాగ్నెటిక్ బాంబులును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు ఎస్ఎస్పీ. డ్రోన్ కూల్చేసిన ప్రాంతాన్ని బాంబు నిర్వీర్య బృందం తనిఖీ చేసినట్లు చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టామన్నారు.
గ్రెనేడ్లు, బాంబులను చూపుతున్న పోలీసులు కశ్మీర్‌లోని అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఆయుధాలతో డ్రోన్ కనిపించటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ యాత్రను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటారనే నిఘా విభాగం హెచ్చరికలతో ఇప్పటికే ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 43 రోజుల పాటు సాగే ఈ యాత్ర జూన్ 30న రెండు దారుల్లో మొదలవుతుంది.
డ్రోన్ మోసుకొచ్చిన బాక్సును పరిశీలిస్తున్న అధికారులు డ్రోన్‌ను తీసుకెళ్తున్న జవాన్లు ఇదీ చూడండి:జైలుకెళ్లొచ్చిన 'హీరోయిన్' దంపతులకు పాలాభిషేకం
రాష్ట్ర ప్రభుత్వం 'కేజీఎఫ్' ప్లాన్.. వర్కౌట్ అయితే కనక వర్షమే!