తెలంగాణ

telangana

ETV Bharat / bharat

30 మంది జాలర్లను నిర్బంధించిన పాక్.. 5పడవలు సీజ్ - జాలర్లు పాకిస్థాన్ న్యూస్

Pakistan detains 30 fishermen: అరేబియా సముద్రంలో వేటకు వెళ్లిన భారత్​కు చెందిన 30మంది జాలర్లను పాకిస్థాన్ అదుపులోకి తీసుకుంది. ఐదు పడవలను సీజ్ చేసింది.

fisherman arrest
జాలర్లు అరెస్ట్

By

Published : Feb 20, 2022, 12:42 PM IST

Pakistan detains 30 fishermen: అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 30మంది భారతీయ మత్స్యకారులను పాకిస్థాన్ అదుపులోకి తీసుకుంది. గుజరాత్​లోని పోర్​బందర్ తీరం నుంచి ఐదు పడవల్లో వీరు బయల్దేరినట్లు అధికారులు తెలిపారు. ఈ ఐదు పడవలను పాకిస్థాన్ సముద్ర తీర గస్తీ దళాలు సీజ్ చేశాయని చెప్పారు.

Pakistan arrests fishermen:

పాక్ సీజ్ చేసిన పడవల్లో రెండు మంగ్రోల్(గిర్ సోమనాథ్)కు చెందినవి కాగా.. ఓఖా, వానకబ్రా, పోర్​బందర్​కు చెందిన పడవలు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

Pak detains Indian boats

అయితే, గత 25 రోజుల వ్యవధిలో 20 పడవలు, 120 మంది భారత జాలర్లను పాక్ తన అధీనంలోకి తీసుకోవడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. దీనిపై మత్స్యకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం 500 మందికి పైగా జాలర్లు పాకిస్థాన్ చెరలో ఉన్నారు. సుమారు 1200 పడవలు అక్కడి అధికారులు సీజ్ చేశారు.

భారత్ అదుపులో పాక్ పడవలు..

జనవరి 31న భారత్​లోకి వచ్చేందుకు ప్రయత్నించిన పాక్ పడవలను బీఎస్ఎఫ్ పట్టుకుంది. మూడు బోట్లు, ఓ పాకిస్థానీ పౌరుడిని అరెస్టు చేసింది. మిగిలిన మత్స్యకారులు తమ పడవలతో బలగాల దృష్టి నుంచి తప్పించుకున్నారు. అయితే, సీజ్ చేసిన బోట్లలో ఎలాంటి అనుమానిత వస్తువులు దొరకలేదు.

ఇదీ చదవండి:ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తుల సజీవ దహనం

ABOUT THE AUTHOR

...view details