తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శ్రీనగర్​ వచ్చే విమానాల విషయంలో పాక్​ కొత్త వివాదం! - భారత్ పాక్ గగనతల విమానం

శ్రీనగర్-షార్జా విమానం తమ గగనతలంలోకి ప్రవేశించకుండా పాకిస్థాన్(pakistan news)​ ఆంక్షలు విధించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాక్ చర్య దురదృష్టకరమైనదని కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.

Pakistan
పాకిస్థాన్​

By

Published : Nov 3, 2021, 4:34 PM IST

శ్రీనగర్​- షార్జా విమానం(sharjah srinagar flight) తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు పాకిస్థాన్​ నిరాకరించిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దుబాయ్ షార్జా నుంచి శ్రీనగర్ వస్తున్న గో ఫస్ట్​ ఎయిర్​వేస్​కు చెందిన విమానం తమ భూభాగంపై ఎగిరేందుకు పొరుగు దేశం అభ్యంతరం తెలిపిందని పేర్కొన్నాయి.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. శ్రీనగర్​- షార్జా (sharjah srinagar flight) మధ్య విమాన సేవలను ప్రారంభించిన వారం రోజులకే పాక్ ఇలాంటి ఆంక్షలు విధించటం చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్​ చేశారు.

"ఇది దురదృష్టకరం. 2009-2010లోనూ పాక్ ఇలాంటి దుశ్చర్యకే పాల్పడింది. ఆ సమయంలో శ్రీనగర్​- దుబాయ్ విమానాన్ని అడ్డుకుంది. విమాన సర్వీసులకు మొదట అనుమతి ఇచ్చి.. తర్వాత ఆంక్షలు విధించటం సరికాదు."

-- ఒమర్ అబ్దుల్లా, కశ్మీర్ మాజీ సీఎం

ఇదే విషయంపై కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ ట్వీట్​ చేశారు. పాక్​ గగనతలం మీదుగా కశ్మీర్ విమానాలు వెళ్లేందుకు.. ఆ దేశాన్ని అనుమతి కోరటాన్ని కేంద్రం పట్టించుకోవటం లేదన్నారు.

అలాంటి సమాచారం లేదు..

మరోవైపు షార్జా(sharjah srinagar flight) నుంచి బయల్దేరిన విమానం.. షెడ్యూల్ ప్రకారమే బుధవారం ఉదయం శ్రీనగర్​ చేరుకున్నట్లు ఎయిర్​పోర్ట్​ డైరెక్టర్ సంతోష్ దోకె తెలిపారు. భారత విమానానికి పాక్ అనుమతిని నిరాకరించినట్లు సమాచారం లేదన్నారు.

జమ్ముకశ్మీర్ పర్యటనలో భాగంగా.. షార్జా- శ్రీనగర్​ మధ్య విమాన సేవలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబరు 23న ప్రారంభించారు.

ఇదీ చూడండి:'ఇంటింటికీ టీకా'.. కరోనాపై పోరులో మోదీ నయా నినాదం

ABOUT THE AUTHOR

...view details