కాల్పుల విరమణ ఒప్పందానికి మరోసారి తూట్లు పొడిచింది పాకిస్థాన్. జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి తాంగ్ధర్ సెక్టార్ వద్ద మసీదులు, ఇళ్లే లక్ష్యంగా మోటార్ షెల్స్‌తో దాడులకు పాల్పడ్డాయి పాక్ బలగాలు. రాజౌరి జిల్లాలోనూ నౌషెరా సెక్టార్ వద్ద పాక్ సైన్యం కాల్పులు జరిపినట్లు భారత్ సైన్యం తెలిపింది.
ఉగ్రవాదుల దాడిలో వ్యక్తి మృతి
శ్రీనగర్‌లోని సారై ప్రాంతంలో రద్దీగా ఉండే మార్కెట్లో ఓ వండ్రంగిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. అయితే అతన్ని ముష్కరులు ఎందుకు చంపారనేది తెలియలేదు.