Pak Terrorist Plans To Attack India : దేశ రాజధాని దిల్లీలో ప్రతిష్ఠాత్మకమైన జీ20 సమావేశాలకు సర్వం సిద్ధమైన వేళ.. షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రపతి భవన్, నేషనల్ వార్ మెమోరియల్ సహా పలు ప్రాంతాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అప్రమత్తమై రక్షణ చర్యలను పటిష్ఠం చేశారు.
బిహార్‌కు చెందిన బన్సీ ఝా అనే వ్యక్తి.. పాకిస్థాన్‌కు గూడఛారిగా వ్యవహరిస్తున్నాడని కోల్‌కతా పోలీసులకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. వెంటనే స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) డిటెక్టివ్‌లు.. బిహార్‌కు వెళ్లి అతడిని అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా అతడి నుంచి మరింత సమాచారం తెలుసుకున్నారు. దిల్లీ, కోల్‌కతా, చెన్నైలోని ప్రముఖ ప్రాంతాలకు చెందిన చిత్రాలను తీసి అతడి పాకిస్థాన్‌కు పంపినట్లు గుర్తించారు.
పాక్ మహిళకు..
Pakistan Spy Bihar : బిహార్‌లోని బన్సీ ఝా ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎస్‌టీఎఫ్ డిటెక్టివ్‌లు.. అనేక చిత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి కోల్‌కతాకు వచ్చి బాలి వంతెనతో పాటు అక్కడే ఉన్న మరో ఆలయానికి చెందిన చిత్రాలను పాకిస్థాన్‌లోని ఓ మహిళకు పంపినట్లు డిటెక్టివ్‌లు ఆరోపించారు. ఆ మహిళ.. పాకిస్థాన్ ఇంటిలిజెన్స్‌లో పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు.
ఆగస్టు 29వ తేదీ ఉదయాన్నే..
మరోవైపు, కోల్‌కతా పోలీసులతో దిల్లీ పోలీసులు.. సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే బన్సీ ఝాను తమ కస్టడీలో తీసుకోవాలని దిల్లీ పోలీసులు భావిస్తున్నారని సమాచారం. ఆగస్టు 29న ఉదయం బిహార్‌లోని బన్సీ ఝాను ఎస్‌టీఎఫ్ అరెస్ట్ చేసిందని వివిధ వర్గాలు తెలిపాయి.