తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముష్కరులపై సైన్యం ఉక్కుపాదం- ఒకరు హతం, ముగ్గురు అరెస్టు - కశ్మీర్ ఎన్​కౌంటర్ వార్తలు

జమ్ము కశ్మీర్​లో ఉగ్రవాదులపై భద్రత బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. దేశంలోకి చొరబడాలని యత్నించేందుకు ప్రయత్నించిన ఓ ముష్కరుడిని కాల్చి చంపిన సైన్యం (Kashmir Encounter Latest).. మరొక ఉగ్రవాదిని అరెస్టు చేసింది. మరోవైపు, పుల్వామా జిల్లాలో పోలీసులు, జవాన్లు కలిసి ఉగ్రవాద శిబిరం గుట్టురట్టు చేసి, ఇద్దరు ఉగ్ర అనుచరులను అరెస్టు చేశారు.

kashmir encounter
కశ్మీర్​ ఎన్​కౌంటర్

By

Published : Sep 28, 2021, 3:21 PM IST

జమ్ముకశ్మీర్​లోని ఉరీ సెక్టార్​లో ఉగ్ర చొరబాటు యత్నాన్ని భద్రత దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయి. సోమవారం సాయంత్రం ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టిన బలగాలు (Kashmir Encounter Latest).. మరో ముష్కరుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. (terrorist caught) పట్టుబడ్డ ఉగ్రవాదిని పాకిస్థాన్ జాతీయుడిగా గుర్తించారు. వీరు బారాముల్లా జిల్లా​లోని సరిహద్దు గుండా భారత్​లోకి వచ్చేందుకు ప్రయత్నించారని అధికారులు తెలిపారు. చొరబాటును అడ్డుకునే క్రమంలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారని వెల్లడించారు.

శిబిరం గుట్టురట్టు

మరోవైపు, పుల్వామా జిల్లాలో పోలీసులు, జవాన్లు కలిసి ఉగ్రవాద శిబిరం గుట్టురట్టు చేశారు. ఇద్దరు ఉగ్ర అనుచరులను అరెస్టు చేశారు. (Terrorist arrested today)

నిఘా వర్గాల సమాచారం అందుకొని పుల్వామా పోలీసులు, ఆర్మీకి చెందిన 55 ఆర్ఆర్ బృందం.. సంబంధిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు తలదాచుకునే శిబిరాన్ని బలగాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీన్ని తమ కోసం నిర్మించాలని లష్కరే తొయిబా కమాండర్ రియాజ్ సతర్​గండ్.. తన అనుచరులకు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.

తనిఖీ చేసిన సమయంలో అందులో ఉగ్రవాదులు ఎవరూ లేరని పోలీసులు వెల్లడించారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి సైతం లభించలేదని చెప్పారు. ఉగ్రవాద శిబిరం ఉన్న ఇంటి యజమానిని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:భాజపాలోకి పంజాబ్ మాజీ సీఎం అమరీందర్​?

ABOUT THE AUTHOR

...view details