Pak Pigeon Caught: పాకిస్థాన్ సరిహద్దు నుంచి అనుమానాస్పద రీతిలో ఓ పావురం రావడం కలకలం సృష్టిస్తోంది. పావురం రెక్కలకు ఆంగ్ల భాషాక్షరాలు సహా గణాంకాల రూపంలో గూఢ భాషను రాసినట్లు అధికారులు గుర్తించారు. సంకేతాలతో కూడిన భాషను నిఘా విభాగం అధికారులు డీకోడ్ చేయడానికి శ్రమిస్తున్నారు.
సాధారణంగా పాక్ నుంచి భారత సరిహద్దులకు పావురాలు వస్తుంటాయి. అనుమానాస్పదంగా ఉన్నవాటిని అధికారులు అదుపులోకి తీసుకుంటారు. వాటి రెక్కలపై స్టాంప్లు, అంకెల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వాటిని డీకోడ్ చేసి అది గూఢచర్యానికి సంబంధించినది కాదని నిర్ధరించుకున్న తర్వాతే వాటిని విడిచిపెడతారు.