Pak model at kartarpur: కర్తార్‌పుర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌లో మోడల్ సులేహా ఇంతియాజ్ తలపై వస్త్రం కప్పుకోకుండా ఫొటోషూట్‌లో పాల్గొనడాన్ని భారత్ ఆక్షేపించింది. దిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో ఆ దేశ తాత్కాలిక రాయబారికి ఈ వ్యవహారంలో మంగళవారం సమన్లు జారీ చేసింది. సులేహా చర్య గురుద్వారా పవిత్రతకు భంగం కలిగించేలా ఉందని పేర్కొంది. ఆమె ఫొటోషూట్ భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సిక్కుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని వ్యాఖ్యానించింది.
ఈ వ్యవహారంలో నిజాయతీతో దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మరోవైపు.. గురుద్వారాలో ఫొటోషూట్‌పై పాక్ మోడల్ సులేహా క్షమాపణలు తెలిపింది. సిక్కుల మనోభావాలను దెబ్బతీయాలని తాను ఆ పని చేయలేదని పేర్కొంది.