తెలంగాణ

telangana

By

Published : Jan 10, 2021, 5:09 AM IST

ETV Bharat / bharat

'కశ్మీర్​లో అలజడులు సృష్టించేందుకు పాక్ కుట్ర​'

కశ్మీర్​లో సమస్యలు సృష్టించేందుకు సున్నిత లక్ష్యాల కోసం పాకిస్థాన్​ చూస్తోందని, దాని కుట్రలను తిప్పికొట్టేందుకు నిఘా పెంచాలన్నారు జమ్ముకశ్మీర్​ డీజీపీ దిల్బాగ్​ సింగ్​. కశ్మీర్​లో ఉగ్రవాద నిరోధక చర్యలను ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కశ్మీర్​ జోన్​లో బలగాలకు సీసీటీవీ కెమెరాలు, ఇతర సామగ్రితో కూడిన పెట్రోలింగ్​ వాహనాలను అందిస్తామని చెప్పారు.

Dilbah singh
జమ్ముకశ్మీర్​ డీజీపీ దిల్బాగ్​ సిం

కశ్మీర్​లో భారీ ఎత్తున అలజడులు సృష్టించేందుకు పాకిస్థాన్​, దాని అనుబంధ ఉగ్రవాద సంస్థలు సున్నిత లక్ష్యాల కోసం చూస్తున్నాయని పేర్కొన్నారు జమ్ముకశ్మీర్​ డీజీపీ దిల్బాగ్​ సింగ్​. పొరుగు దేశం దుశ్చర్యలను తిప్పికొట్టేందుకు కఠిన నిఘా చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.

కశ్మీర్​ జోన్​లో క్షేత్రస్థాయి పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన క్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు దిల్బాగ్​ సింగ్​.

" పాకిస్థాన్​, దాని అనుబంధ సంస్థలు కశ్మీర్​లో అలజడులు సృష్టించేందుకు సున్నిత లక్ష్యాల కోసం చూస్తున్న క్రమంలో భద్రతా పరమైన చర్యలను కట్టుదిట్టం చేయాలి. దేశ వ్యతిరకే కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పాక్​ ఆధారిత ఉగ్రవాద సంస్థలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా తీవ్రవాద నిరోధక చర్యలను పెంచాలి. జమ్ముకశ్మీర్​ పోలీసులతో పాటు దాని అనుబంధ ఏజెన్సీలు, భద్రతా దళాలు శాంతి అజెండాను ముందుకు తీసుకెళ్లాలి. గత ఏడాదిగా ఎంతో సాధించాం. కానీ భవిష్యత్తులో అంతకు మించి సాధించాలి. "

- దిల్బాగ్​ సింగ్​, జమ్ముకశ్మీర్​ డీజీపీ

శ్రీనగర్​-జమ్ము జాతీయ రదహారిలో మోహరించిన బలగాలకు సీసీటీవీ కెమెరాలు, ఇతర సామగ్రి కలిగిన పెట్రోలింగ్​ వాహనాలను సమకూర్చనున్నట్లు తెలిపారు డీజీపీ. ఈ వాహనాలతో బలగాలకు మరింత బలం చేకూరనుందన్నారు. కశ్మీర్​ లోయలో ఇటీవల భారీగా కురుస్తోన్న మంచులోనూ పోలీసు బలగాలు ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శిస్తున్నాయని కొనియాడారు.

ఇదీ చూడండి:ముంబయి దాడుల సూత్రధారికి 15 ఏళ్ల జైలు

ABOUT THE AUTHOR

...view details