Pak Hand Over Fisherman: పాకిస్థాన్ అధికారులు అరెస్టు చేసిన 20 మంది భారత మత్స్యకారులు సోమవారం విడుదలయ్యారు. కరాచీలోని లాంధీ జైలులో నాలుగేళ్లు శిక్ష ముగించుకుని.. వాఘా సరిహద్దు ద్వారా తిరిగి భారత్‌కు చేరుకున్నారు. ఈ మేరకు పాకిస్థాన్‌కు చెందిన సామాజిక సంక్షేమ సంస్థ.. ఈధి ఫౌండేషన్ స్పష్టం చేసింది. లీగల్ ఫార్మాలిటీస్ ముగిశాక జాలర్లను బీఎస్ఎఫ్ అధికారులకు అప్పగించినట్లు పేర్కొంది.
"జైలు శిక్ష అనంతరం ఆదివారం 20 మంది జాలర్లు విడుదలయ్యారు. సోమవారం అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద వారిని భారత జవాన్లకు అప్పగించాం." అని ఈధి ఫౌండేషన్ ప్రతినిధి మహమ్మద్ యూనిస్ పేర్కొన్నారు.