తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డ్రోన్లతో ఆయుధాల తరలింపు.. ఉగ్ర ముఠా గుట్టు రట్టు

Pak drone attack in jammu: జమ్ముకశ్మీర్​లో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు పోలీసులు. పాకిస్థాన్​ నుంచి డ్రోన్ల సాయంతో భారత భూభాగంలో జారవిడిచిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్​ చేశారు. ఈ ఘటనపై ఎఫ్​ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Pak drone attack in jammu
డ్రోన్లతో ఆయుధాల తరలింపు.

By

Published : Feb 25, 2022, 5:32 AM IST

Pak drone attack in jammu: డ్రోన్లతో ఆయుధాలు తరలించి దాడులకు పాల్పడేందుకు యత్నించిన ఉగ్ర ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. కశ్మీర్​లోని ఆర్​ఎస్​ పురా సెక్టార్​లో డ్లోన్ల ద్వారా విడిచిపెట్టిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్​ చేశారు. డ్రోన్ల కదిలికలు ఉన్నాయన్న సమాచారంతో తనిఖీలు చేపట్టారు పోలీసులు. జమ్ము జిల్లా ఆర్​ఎస్​ పురా- ఆర్నియా ప్రాంతంలో సోదాలు చేసినట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

.

ఒక పిస్తోల్, మూడు డిటోనేటర్లు, మూడు ఐఈడీ బాంబులు, మూడు బాటిళ్ల పేలుడు సామగ్రి, ఓ బండిల్ కార్టెక్స్ వైర్​, ఆరు గ్రనేడ్​లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పాకిస్థాన్​ నుంచి డ్లోన్ల సాయంతో లష్కర్​ ఏ తోయిబా(ఎల్ఈటీ) ఇలాంటి ఘటనలకు పాల్పడుతోందన్నారు.

అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీగా డ్రోన్లు జారవిడిచి ఉగ్రదాడులకు పాల్పడేందుకు ఎల్​ఈటీ యత్నిస్తోందని అధికారి తెలిపారు. ఈ ఘటనపై ఆర్నియా పోలీస్​స్టేషన్​లో ఎఫ్​ఐఆర్ నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టామన్నారు.

ఇదీ చూడండి:పడవ బోల్తా.. నలుగురు మృతి.. 14 మంది గల్లంతు

ABOUT THE AUTHOR

...view details