పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఇస్లామాబాద్ హైకోర్టునేరస్థుడిగా ప్రకటించింది . అల్ అజీజియా, అవెన్‌ఫీల్డ్ గ్రాఫ్ట్ కేసులకు సంబంధించిన కేసుల్లో నవాజ్ షరీఫ్ అప్పీళ్లపై జస్టిస్ అమీర్ ఫరూఖ్, జస్టిస్ మొహ్సిన్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. నోటీసులు పంపినప్పటికీ న్యాయస్థానం ఎదుట షరీఫ్ హాజరు కాకపోవడంపై ధర్మాసం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై అధికారులను వివరణ కోరింది.
లండన్, లాహోర్‌లలోని షరీఫ్ నివాసానికి సమాచారం పంపినట్లు విదేశాంగ శాఖ, అంతర్గత వ్యవహారాలు శాఖ కార్యాలయ అధికారులు.. కోర్టుకు నివేదించారు. అయినప్పటికీ షరీఫ్ హాజరు కాకపోవడం వల్ల ఆయనను అపరాధిగా ప్రకటిస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది.