తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మురికివాడల్లో టెస్టింగ్​ కిట్ల ప్యాకింగ్​- వీడియో వైరల్​ - ఆర్టీపీసీ-ఆర్ టెస్టింగ్ కిట్ల ప్యాకింగ్​

మహారాష్ట్ర థానే​లోని మురికివాడల్లో నివాసం ఉండే మహిళలకు ఆర్టీపీసీ-ఆర్ టెస్టింగ్ కిట్ల ప్యాకింగ్ పనిని అప్పగించాడో కాంట్రాక్టర్. అయితే.. ఈ పనుల్లో నిమగ్నమైన మహిళలు, పిల్లలు కొవిడ్ నిబంధనలను పాటించకుండానే ప్యాకింగ్ చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

packing RT-PCR swab sticks
టెస్టింగ్ కిట్ల ప్యాకింగ్​లో నిబంధనలు కరవు

By

Published : May 6, 2021, 9:38 AM IST

ఆర్టీపీసీ-ఆర్ టెస్టింగ్ కిట్ల ప్యాకింగ్​లో పాటించని కరోనా నిబంధనలు

మహారాష్ట్రలో కరోనా విలయం తాండవం చేస్తోందనే వార్తలు నిత్యం కలవరపరుస్తూనే ఉన్నాయి. దీనితో కరోనా నిర్దరణ పరీక్షల్లో ఉపయోగించే కిట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇదే అదునుగా భావించి.. సొమ్ము చేసుకోవాలనుకుంటున్న కొందరు కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు.

నిర్దరణ పరీక్షల్లో ఉపయోగించే ఆర్టీపీసీ-ఆర్ కిట్లను ఎటువంటి భద్రతా చర్యలు పాటించకుండానే ప్యాకింగ్​ చేస్తున్న షాకింగ్ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

ఇదీ జరిగింది..

ఉల్లాస్​నగర్​ క్యాంప్-2 ఖేమానీ ప్రాంతంలోని మహిళలకు ఓ కాంట్రాక్టర్ టెస్టింగ్​ కిట్ల ప్యాకింగ్ పనిని అప్పగించినట్లు సమాచారం. ఇంట్లోని మహిళలు, పిల్లలు కరోనా నిబంధనలు పాటించకుండానే ప్యాక్ చేస్తున్నారు. కనీసం మాస్క్​ కూడా ధరించకుండా వారు ప్యాకింగ్​ చేయడం గమనార్హం. ఇలాంటి చర్యలు కరోనా మరింత ప్రబలడానికి కారణవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఆరుబయట టెస్టింగ్ కిట్ల ప్యాకింగ్
ఓ ఇంట్లో ప్యాకింగ్​ పనుల్లో నిమగ్నమైన చిన్నారులు

వెయ్యి కిట్లను ప్యాక్ చేస్తే.. రూ.20 అందుతాయని మురికివాడల్లోని మహిళలు చెబుతున్నారు. మాస్క్​లు, శానిటైజర్​ అలాంటివి ఏవీ ఇవ్వుకుండా తమ ఆర్థిక పరిస్థితిని కాంట్రాక్టర్ సొమ్ము చేసుకుంటున్నాడని అంటున్నారు.

ఇవీ చదవండి:అక్కడ ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్‌!

'కరోనా మూడోదశ అనివార్యం- ఎదుర్కొనేందుకు సిద్ధం!'

ABOUT THE AUTHOR

...view details