ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసంలో విధులు నిర్వర్తించే ఓ కానిస్టేబుల్ అనుమానస్పద రీతిలో మృతి చెందాడు. సీఎం నివాసంలో విధులు ముగించుకుని పోలీస్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న అతడు.. ప్రభుత్వ వాహనంలోనే విగతజీవిగా కనిపించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
సీఎం నివాసంలో కలకలం.. తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ మృతి.. రంగంలోని దిగిన పోలీసులు..! - మహారాష్ట్ర రేప్ కేసు
యూపీ ముఖ్యమంత్రి నివాసంలో విధులు నిర్వరిస్తున్న ఓ కానిస్టేబుల్ అనుమానస్పద రీతిలో మృతి చెందాడు. ప్రస్తుతం ఆ కానిస్టేబుల్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీస్ దీనిపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. ముంబయిలో జరిగిన మరో ఘటనలో మతిస్థిమితం సరిగా లేని ఓ బాలికపై ముగ్గురు కాంమాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అలీగఢ్‌కు చెందిన విపిన్ కుమార్ అనే 2021 బ్యాచ్‌కు చెందిన పీఏసీ కానిస్టేబుల్.. ప్రస్తుతం లఖ్‌నవూలోని ముఖ్యమంత్రి నివాసంలో గత నెలరోజులుగా విధులు నిర్వరిస్తున్నాడు. విపిన్ ఎప్పటిలానే శనివారం సీఎం నివాసంలో విధులు ముగిశాక.. రమాబాయిలోని పోలీస్ క్యాంపు కార్యాలయానికి.. ప్రభుత్వ వాహనంలో చేరుకున్నాడు. అయితే అక్కడకు చేరుకున్న కొద్దిసేపటికే ఆ కారులో కాల్పుల శబ్ధం వచ్చింది. వెంటనే అక్కడున్న పీఏసీ కానిస్టేబుల్స్ కారులో విపిన్ బుల్లెట్ గాయాలతో పడి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే విపిన్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. అయితే విపిన్ తన ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్‌లోని బుల్లెట్లు తగలగా మృతిచెందినట్లు అధికారులు గుర్తించారు. ఆ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు హత్య, ఆత్మహత్య, ప్రమాదమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మానసిక వికలాంగురాలిపై రేప్..
మహారాష్ట్రలో దారుణం జరిగింది. మతిస్థిమితం సరిగా లేని ఓ బాలికపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ముంబయిలోని ఘట్కోపర్ ప్రాంతంలో మతిస్థిమితం సరిగా లేని బాలిక ఇంటినుంచి బయటకు రాగా.. ముగ్గురు మైనర్లు ఆమెను టాయిలెట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం దాన్ని వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో స్థానికంగా వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఆ వీడియోను ఆమె సోదరుడు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ నిందితులను అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్‌కు తరలించినట్లు తెలిపారు.