Paazee Forex Scam: తమిళనాడులో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన కేసు విషయంలో.. కోయంబత్తూర్ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. తిరుప్పూర్‌లో 2009లో స్థాపించిన పాజీ అనే ఆన్లైన్ ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్స్‌కు శిక్షను విధించింది. ఈ కంపెనీలో ప్రజలు పెట్టుబడిగా పెట్టిన రూ.930 కోట్లను.. తిరిగి ఇవ్వకపోవడం వల్ల 2013లో 1402 మంది బాధితులు వీరిపై కేసు నమోదు చేశారు. 9 సంవత్సరాలుగా సాగుతున్న ఈ కేసులో ఇరువైపుల వాదనలు విన్న కోయంబత్తూర్ కోర్టు.. నిందితులకు 27 సంవత్సరాల జైలు శిక్ష, రూ.171 కోట్ల జరిమానాను విధించింది.
అసలేం జరిగిందంటే..2009లో తిరుప్పూర్‌లో.. మోహన్‌రాజ్, అతని తండ్రి కతిరవణ్, కమలవళ్లీలు కలిసి పాజీ అనే ప్రైవేట్ కంపెనీని స్థాపించారు. పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని ప్రజలను నమ్మించారు. ఇది నమ్మిన ప్రజలు భారీ లాభాలు వస్తాయనే ఆలోచనతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. ప్రజలు తమ పెట్టుబడిని తిరిగి ఇవ్వనందున.. 2013లో 1402 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. ఇందులో దాదాపు 58,000 మంది పెట్టుబడులు పెట్టినట్లు.. వాటి విలువ రూ.930 కోట్లుగా కోర్టు గుర్తించింది.