తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొవిడ్​ రోగులకు ఉచితంగా ప్రాణవాయువు అందిస్తూ..

కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశంలో ఆక్సిజన్​ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉత్తర్​ప్రదేశ్​ ఇందిరాపురం గురుద్వారాలో ఆక్సిజన్​ లాంగర్​ను ఏర్పాటు చేసి కొవిడ్ రోగులకు అండగా నిలుస్తున్నారు నిర్వాహకులు.

oxygen langer
ఆక్సిజన్ లాంగర్, కొవిడ్​ రోగులు

By

Published : Apr 24, 2021, 1:39 PM IST

లాంగర్​ ఏర్పాటు చేసి ఉచితంగా ప్రాణవాయువు అందిస్తూ

దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సరఫరా లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ ఇందిరాపురంలోని గురుద్వారాలో ఆక్సిజన్ లాంగర్‌ను అందుబాటులోకి తెచ్చారు. మహమ్మారి సోకి శ్వాస సంబంధ వ్యాధితో బాధపడుతున్న వారికి ఇక్కడ ఉచితంగా ఆక్సిజన్‌ అందిస్తున్నారు.

శ్వాసకోశ సమస్య ఉన్న ఎవరికైనా ఇక్కడ ఆక్సిజన్‌ను అందిస్తామని గురుద్వారా నిర్వాహకులు తెలిపారు. ఆసుపత్రిలో ప్రాణవాయువు దొరకని వారి కోసం లాంగర్‌ ఏర్పాటు చేశామని, ఆక్సిజన్‌ పొందేందుకు ఎలాంటి పత్రాలు చూపించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. చాలామంది వస్తున్నారని, వారందరికీ ప్రాణ వాయువు అందిస్తున్నామని గురుద్వారా అధ్యక్షుడు గుర్‌ప్రీత్ సింగ్ తెలిపారు. తమకు రోజూ వందల సంఖ్యలో కాల్స్‌ వస్తున్నాయని.. మరిన్ని ఆక్సిజన్‌ సిలిండర్ల కోసం మరికొన్ని సంస్ధలతో ఒప్పందం చేసుకున్నామని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:అవినీతి కేసులో దేశ్​ముఖ్​పై సీబీఐ ఎఫ్ఐఆర్

ABOUT THE AUTHOR

...view details