తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆక్సిజన్‌ కూడా మందులాంటి చికిత్సా పద్ధతే'

కరోనా బారినపడ్డ వారిలో ఆక్సిజన్‌ స్థాయి 93-94 ఉంటే వారికి హైఫ్లో ఆక్సిజన్‌ అవసరం లేదని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు. కొవిడ్​ సోకిన వారిలో 85శాతం మందికి ప్రత్యేక చికిత్స అవసరం లేదని వివరించారు.

randeep, guleria
ఆక్సిజన్‌ కూడా మందులాంటి చికిత్సా పద్ధతే

By

Published : Apr 22, 2021, 6:52 AM IST

కొవిడ్‌ సోకిన వారిలో 85 శాతం మందికి ప్రత్యేక చికిత్స లేకుండానే వ్యాధి నయం అవుతుందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు. అత్యధిక మందిలో సాధారణ జలుబు, గొంతులో సమస్య వంటి సాధారణ లక్షణాలే ఉంటాయని, వారంలోనే అలాంటివారంతా కోలుకుంటారన్నారు.

రణ్‌దీప్‌ గులేరియా బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విలేకర్లతో మాట్లాడారు. 'ఆక్సిజన్‌ స్థాయి 93-94 ఉన్న ఆరోగ్యవంతులకు హైఫ్లో ఆక్సిజన్‌ అవసరం లేదు. ఆ స్థాయి కన్నా తగ్గినప్పుడే సూక్ష్మ పర్యవేక్షణ అవసరం. అప్పుడు కూడా ఆక్సిజన్‌ అవసరం ఉండదు. ఆక్సిజన్‌ కూడా మందులాంటి చికిత్సా పద్ధతే. దాన్ని అప్పుడప్పుడు తీసుకోవడం అంటే వృథాచేసినట్లే' అని తెలిపారు.

ఇదీ చూడండి:'మహా' విలయం- ఒక్కరోజే 67,468 మందికి కరోనా​

ABOUT THE AUTHOR

...view details