దిల్లీలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. బాత్రా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 12 మంది కొవిడ్ రోగులు మరణించినట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. కరోనా రోగుల వివరాలను సమర్పించాలన్న దిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఆసుపత్రి ఈ వివరాలను న్యాయస్థానానికి సమర్పించింది. ఆక్సిజన్ సరఫరాలో ఆలస్యం కారణంగా 12 మంది రోగులు మరణించారని దిల్లీ హైకోర్టుకు తెలిపిన బాత్రా యాజమాన్యం.. గంటన్నరకు పైగా ప్రాణవాయువు సరఫరా నిలిచిపోయిందని తెలిపింది.
ఆక్సిజన్ కొరతతో 12 మంది కరోనా రోగులు మృతి - దిల్లీలో ఆక్సిజన్ కొరత
దిల్లీలోని బాత్రా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 12 మంది కొవిడ్ రోగులు చనిపోయారు. ఈ విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం దిల్లీ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.
ఆక్సిజన్ కొరతతో 12 మంది కరోనా రోగులు మృతి
బాత్రా ఆసుపత్రికి ఆక్సిజన్ చేరుకుందన్న దిల్లీ మంత్రి రాఘవ్ చద్దా... పరిస్థితి ఇప్పుడు మెరుగైందని తెలిపారు. ఆసుపత్రిలో మరి కొందరు కరోనా రోగుల పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఎండీ ఎస్సీఎల్ గుప్తా తెలిపారు.
ఇదీ చూడండి:'ప్రాణాలు పోతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం?'