Owner Shot Dead: చెంప దెబ్బకు ప్రతీకారంగా ఇంటి యజమానిని దారుణ హత్య చేశాడో వ్యక్తి. ఈ ఘటన హరియాణా గురుగ్రామ్‌లోని బిలాస్‌పుర్ ఖుర్ద్ ప్రాంతంలో జరిగింది. నిందితుడు రోహ్తక్ జిల్లాకు చెందిన కైలాష్‌గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని నుంచి ఓ పిస్టోల్, ఏడు బుల్లెట్లు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
చెంప దెబ్బకు రివెంజ్.. ఇంటి యజమానిపై ఐదు రౌండ్ల కాల్పులు - హరియాణా క్రైమ్ న్యూస్
Owner Shot Dead: ఇంటి యజమానికి అతనికి మధ్య కొద్ది రోజుల క్రితం గొడవ జరిగింది. ఈ క్రమంలో యజమాని ఆ వ్యక్తి చెంప మీద కొట్టాడు. ఇందుకు ప్రతీకారంగా యజమానిని హత్య చేయాలని నిశ్చయించుకున్న నిందితుడు అతనిపై ఐదురౌండ్ల కాల్పులు జరిపి దారుణంగా హత్య చేశాడు.
ఇదీ జరిగింది.. నిందితుడు కైలాష్ బిలాస్‌పుర్ ఖుర్ద్‌లో ఓ దుకాణం యజమానైన దీపక్ ఇంట్లో నివసించేవాడు. కొద్ది రోజుల క్రితం దీపక్, కైలాష్ల మద్య గొడవ జరిగింది. ఈ క్రమంలో దీపక్.. కైలాష్ చెంప మీద కొట్టాడు. దీంతో తనను చెంపదెబ్బ కొట్టినందుకు ప్రతీకారంగా దీపక్‌ను హతమార్చాలని నిశ్చయించుకున్నాడు కైలాష్. గురువారం సాయంత్రం.. బంధువుల ఇంటి నుంచి బయటకు వచ్చి కారు ఎక్కుతుండగా బైక్‌పై వచ్చిన నిందితుడు దీపక్‌పై ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. పరారయ్యేందుకు ప్రయత్నించిన నిందితుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీపక్‌ను ఆసుపత్రికి తరలించగా అతను అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు.
ఇదీ చూడండి :గర్భం దాల్చాలని ఖైదీ భార్య కోరిక.. భర్తకు 15 రోజులు పెరోల్ ఇచ్చిన కోర్టు