తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అపోహలు వీడు.. కరోనాతో పోరాడు - కరోనాను ఎదుర్కోవడం ఎలా

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవానికి ప్రజల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే కొవిడ్​పై అనేక అపోహలు, అపనమ్మకాలు ఎక్కువైపోయాయి. అంతర్జాలంలో దొరికిన సమాచారంతో కొందరు సొంతంగా చికిత్స తీసుకుంటున్నారు. అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? కరోనా నుంచి ఎలా రక్షించుకోవాలి? అనే విషయాలను తెలుసుకోండి.

COVID
అపోహలు వీడు.. కరోనాతో పోరాడు

By

Published : May 12, 2021, 4:09 PM IST

Updated : May 12, 2021, 4:48 PM IST

కొవిడ్‌ దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ విరుచుకుపడుతోంది. ఈ మహమ్మారి బారినపడి నిత్యం ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు కొవిడ్‌పై రకరకాల అపోహలు, అపనమ్మకాలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉంటున్నాయి. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ఈ రోజుల్లో వాటిలో వచ్చే సూచనలు, సలహాలను పాటిస్తూ కొందరు, గూగుల్‌లో శోధించి ఇంకొందరు సొంతంగా కొవిడ్‌కు చికిత్స తీసుకుంటున్నారు. అవసరం లేకపోయినా కొందరు సీటీస్కాన్‌ల కోసం ల్యాబ్‌ల వద్ద బారులుదీరుతున్నారు.

కొందరైతే స్వల్ప లక్షణాలున్నా, తమకు ఏదో అవుతుందనే ఆందోళనతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఉపయోగపడేలా హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) నిపుణుల బృందం ఒక మార్గదర్శిని(గైడ్‌)ని రూపొందించింది. ఆసుపత్రి ఛైర్మన్‌ డా. డి నాగేశ్వరరెడ్డి, డైరెక్టర్‌ డా. జి.వి.రావు దీనిని విడుదల చేశారు.

పరీక్ష.. ఐసొలేషన్‌, చికిత్స

కరోనా లక్షణాలపై ఇంకా చాలామందికి అనుమానాలున్నాయి. తొలి విడతలో జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, పొడి దగ్గు మాత్రమే ఉండేవి. రెండో విడతలో వీటితో పాటు అనేక కొత్త లక్షణాలు బయట పడుతున్నాయి. అవి ఏంటంటే..

అపోహలు వీడు.. కరోనాతో పోరాడు

ఇందులో ఒకటి లేదా అంతకుమించిన లక్షణాలు ఉంటే కొవిడ్‌గా అనుమానించాలి. వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి, ఐసొలేషన్‌లోకి వెళ్లాలి. పాజిటివ్‌గా తేలితే చికిత్స ప్రారంభించాలి.

ఇదీ చదవండి:ప్రతిధ్వని: ప్రజల్లో కరోనా భయాలను జయించడం ఎలా?

కొరాడ్‌ స్కోర్‌ అంటే...

సీటీస్కాన్‌ అనగానే కొరాడ్‌ స్కోర్‌ ఎంత అనేది ప్రతి ఒక్కరూ అడిగే ప్రశ్న. నిజానికి కొరాడ్‌ స్కోర్‌ అంటే కేవలం నిర్ధారణ పరీక్ష మాత్రమే. అది కొవిడ్‌ తీవ్రత తెలిపేది కాదు. ఈ స్కోర్‌ ఎంత ఉంటే కొవిడ్‌గా నిర్ధారించాలి అనేది కీలకం.

అపోహలు వీడు.. కరోనాతో పోరాడు
అపోహలు వీడు.. కరోనాతో పోరాడు
అపోహలు వీడు.. కరోనాతో పోరాడు
అపోహలు వీడు.. కరోనాతో పోరాడు
అపోహలు వీడు.. కరోనాతో పోరాడు

చికిత్సలో ఇవి అవసరమా?

రెమ్‌డెసివిర్‌:ఇది సంజీవని కాదు. ఆసుపత్రిలో చేరిన ప్రతి ఒక్కరికీ ఇది అవసరం లేదు. చాలా తక్కువ మంది రోగులకే అవసరమవుతుంది. లక్షణాల తీవ్రత బట్టి తొలివారంలో వైద్యుల సమక్షంలో అందిస్తారు.

ఇదీ చదవండి:వృద్ధులకు కరోనా భయం.. అవగాహన అవసరం

టొసిలిజుమ్యాబ్‌:తీవ్ర లక్షణాలతో ఐసీయూలో ఉండే కొవిడ్‌ రోగులకు వైద్యులు సూచనలతో ఇచ్చే సూదిమందు ఇది. రెండు వైపులా పదునున్న కత్తిగా దీనిని వ్యవహరిస్తారు. శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని తగ్గించి సైటోక్విన్‌ స్టోమ్‌ నుంచి కాపాడుతుంది. దీనితో ఇతర ఇన్‌ఫెక్షన్లు దాడిచేసే ప్రమాదం లేకపోలేదు.

అపోహలు వీడు.. కరోనాతో పోరాడు

"అపోహలతో అనవసర భయాలు పెరుగుతాయి. భయం వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. ఇప్పటివరకు 20 వేల మంది కొవిడ్‌ రోగులకు విజయవంతంగా చికిత్స అందించాం. ఆ అనుభవంతో సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా ఈ మార్గదర్శినిని తీర్చిదిద్దాం. త్వరలో అన్ని ప్రాంతీయ భాషల్లో దీన్ని అందిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులను ఎదుర్కోవాలంటే ప్రత్యేక ప్రణాళిక అవసరం. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే కృషి జరగాలి. అప్పుడే ఎక్కడ, ఏ సేవలు అందుబాటులో ఉన్నాయనే సమాచారం అందుబాటులో ఉంటుంది. దిల్లీ, బెంగళూరులో కొంతవరకు ఈ ప్రయత్నం జరిగింది." - డా. డి నాగేశ్వరరెడ్డి & డా. జి.వి.రావు

ఇదీ చదవండి:'మహమ్మారి'పై భయం వీడితేనే జయం

Last Updated : May 12, 2021, 4:48 PM IST

ABOUT THE AUTHOR

...view details