తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'విదేశాలకు కోట్లాది టీకాలు పంపింది ఇందుకే...'

విదేశాలకు పంపిన టీకాల్లో 84 శాతం డోసులు నిబంధనల ప్రకారం ఉత్పత్తి సంస్థలు​ కచ్చితంగా పంపాల్సినవే అని భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు. టీకాల పంపిణీపై కాంగ్రెస్​, ఆప్​ దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

sambit patra BJP
సంబిత్ పాత్రా, భాజపా అధికార ప్రతినిధి

By

Published : May 12, 2021, 5:44 PM IST

కొవిడ్​ టీకాలను భారత్ విదేశాలకు పంపడంపై కాంగ్రెస్​, ఆమ్​ ఆద్మీ పార్టీ దుష్ప్రచారం చేస్తున్నాయని భాజపా మండిపడింది. 84 శాతం టీకాలు విదేశాల్లో అనుమతులు, ఇతర వాణిజ్యపరమైన నిబంధనలకు అనుగుణంగా పంపినవని పేర్కొంది.

1.07 కోట్ల కొవిడ్ టీకా డోసులను సహాయపూర్వకంగా భారత్.. విదేశాలకు ఇచ్చిందని, అందులో 78.5 లక్షల టీకాలు ఏడు పొరుగు దేశాలకు పంపిణీ చేసినట్లు భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తెలిపారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు పెంచుకోవడం భారత్​కు లాభదాయకమైన విషయమని అన్నారు.

భారత్​లో పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ జరపకుండానే 6.63 కోట్ల వ్యాక్సిన్ డోసులు విదేశాలకు పంపారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తుండడాన్ని సంబిత్ పాత్రా తప్పుపట్టారు. నిబంధనల ప్రకారం 5.50 కోట్ల వ్యాక్సిన్​ డోసులను రెండు సంస్థలు విదేశాలకు పంపాల్సి వచ్చినట్లు వివరించారు.

భారత్ బయోటెక్, సీరమ్ సంస్థలు అభివృద్ధి చేసిన కొవిడ్ టీకాల ఫార్ములాలను కేంద్రం ఇతర సంస్థలకు అందజేయాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే కోరారు. దీనిపై స్పందించిన సంబిత్ పాత్రా.. సీరం సంస్థ తమ ఫార్ములాను ఇతర సంస్థలతో ఇవ్వలేదని, ఆ అధికారం ఆస్ట్రాజెనెకాకు ఉందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:మరో టీకా రెడీ- జంతువు యాంటీబాడీలతో అభివృద్ధి!

ABOUT THE AUTHOR

...view details