తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలింగ్​ కేంద్రం మార్చారని ఓటేయని గ్రామస్థులు

పోలింగ్​ కేంద్రాన్ని మార్చినందుకు ఎన్నికలను సామూహికంగా బహిష్కరించారు ఓ గ్రామానికి చెందిన ఓటర్లు. ఈ ఘటన అసోంలోని బార్​పేట జిల్లాలో జరిగింది.

assam villagers boycott polls
పోలింగ్​ కేంద్రం మార్చారని ఓటేయని గ్రామస్థులు

By

Published : Apr 6, 2021, 4:12 PM IST

తమ గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని వేరే ప్రాంతానికి తరలించారని ఎన్నికలను సామూహికంగా బహిష్కరించారు అసోం బార్​పేట్​ జిల్లా బిష్ణుపుర్ గ్రామస్థులు. చెంగ నియోజకవర్గంలోని ఈ గ్రామంలో దాదాపు 700 మంది ఓటర్లున్నారు.

ఓటేయకుండా నిరసన తెలిపిన గ్రామస్థులు

ఇదీ జరిగింది..

తొలుత బిష్ణుపుర్​ గ్రామస్థుల కోసం బారా ప్రైమరీ స్కూల్​లోని ఓ గదిని పోలింగ్​ కేంద్రంగా ఏర్పాటు చేశారు అధికారులు. తర్వాత పోలింగ్ కేంద్రాన్ని బార్బిలా గ్రామానికి మార్చుతున్నట్లు ప్రకటించారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు బిష్ణుపుర్​ గ్రామస్థులు. ఓటు వేసేందుకు తమకు తొలుత నిర్ణయించిన ప్రాంతమే అనుకూలంగా ఉంటుందని తెలిపారు.

ఓటేసేందుకు గ్రామస్థుల నిరాకరణ

పోలింగ్​ కేంద్రాన్ని మార్చొద్దని అధికారులను బతిమిలాడినా వారు పట్టించుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పోలింగ్​ కేంద్రాన్ని మార్చేందుకు కారణం కూడా తెలపలేదని పేర్కొన్నారు. ఇందుకు నిరసనగా ఓటింగ్​ బహిష్కరించినట్లు చెప్పారు.

ఇదీ చదవండి:భారత్​, రష్యా మైత్రిపై విదేశాంగ మంత్రుల చర్చ

ABOUT THE AUTHOR

...view details