తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తిస్తారా?.. భారత్​ జవాబు ఇలా...

అఫ్గానిస్థాన్​ను తాలిబ్లను ఆక్రమించుకున్న నేపథ్యంలో ఇప్పటివరకు 260 మంది భారతీయులను మన దేశానికి తీసుకువచ్చినట్లు విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్​ బాగ్చి చెప్పారు. ఆరు విమానాల్లో సుమారు 550 మంది భారత్​కు వచ్చినట్లు పేర్కొన్నారు.

Indians, evacuated from Afghanistan
అరిందమ్​ బాగ్చి

By

Published : Aug 27, 2021, 6:08 PM IST

Updated : Aug 27, 2021, 6:52 PM IST

తాలిబన్లు అఫ్గానిస్థాన్​ను వశం చేసుకున్న నాటి నుంచి ఆరు వేరువేరు విమానాల్లో 550 మందిని భారత్​కు తరలించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. వీరిలో సుమారు 260 మంది భారతీయులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇతర సంస్థల ద్వారా కూడా భారత్​ పౌరులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలను చేపడుతోందని చెప్పారు. ఇందుకుగానూ అమెరికా, తజికిస్థాన్​ వంటి దేశాలతో ఎప్పటికప్పుడు ​ సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు.

' మా అంచనా ప్రకారం ఇప్పటి వరకు చాలా మంది భారతీయులను అఫ్గాన్​ నుంచి భారత్​కు తీసుకువచ్చాం. మరికొంతమంది అక్కడ ఉండే అవకాశం ఉంది. ఎంత మంది ఉన్నారనేది కచ్చితంగా చెప్పలేము. కాబుల్​ నుంచి చివరగా వచ్చిన విమానంలో 40 మంది ఉన్నారు. మన దేశం నుంచి వెళ్లి అఫ్గాన్​ పౌరులుగా ఉన్న సిక్కులు, హిందువులు కొంతమంది ఆగస్టు 25న విమానాశ్రయానికి చేరుకోలేకపోయారని మాకు సమాచారం అందింది. ఎందుకంటే అక్కడ అఫ్గాన్​ పౌరులు విమానాశ్రయం చేరుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఆ విమానం వాళ్లు ఎవరూ లేకుండానే వచ్చింది.'

-అరిందమ్​ బాగ్చి, విదేశాంగ శాఖ ప్రతినిధి

అఫ్గాన్​లో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు బాగ్చి చెప్పారు. శాంతి, సామరస్యం, సంపన్నమైన, ప్రజాస్వామ్య అఫ్గాన్​ను కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం ప్రజల తరలింపుకు సంబంధించి భద్రతాపరమైన అంశాలు ఎలా కొలిక్కి వస్తాయో చూడాలని అన్నారు. ఇతర దేశాలు కూడా ఇలానే వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు.

తాలిబన్​ ప్రభుత్వం గుర్తింపుపై స్పందించిన ఆయన.. ప్రభుత్వ ఏర్పాటు అఫ్గాన్​లో పరిస్థితులు అనుకున్న విధంగా లేవని అన్నారు. ప్రజల భద్రత పైనే తాము ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు చెప్పారు. అంతేగాకుండా అక్కడ నుంచి వచ్చే శరణార్థులపై ఎటువంటి నిర్ణయం తీసుకునే దానిపై కూడా స్పందించారు. భారత్​కు వచ్చే అఫ్గాన్​ పౌరులకు కేంద్ర హోంశాఖ ఈ-ఎమర్జెన్సీ వీసాను ప్రకటించిందని తెలిపారు. వీటి కాల వ్యవధి ఆరునెలలు ఉంటుందని.. దీంతో వారు ఈ సమయంలో ఇక్కడే ఉంటారని అన్నారు.

ఇదీ చూడండి:kabul airport blast: కాబుల్​ ఆత్మాహుతి దాడులను ఖండించిన భారత్​

Last Updated : Aug 27, 2021, 6:52 PM IST

ABOUT THE AUTHOR

...view details