దేశంలో వ్యాక్సిన్ సరఫరాను పెంచాలని వైద్య నిపుణులు, ఆర్థిక వేత్తలు, శ్రామిక సంఘాలు, మానవ హక్కుల సంఘాలతో కూడిన మొత్తం 500 మంది మేధావులు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొనేందుకు టీకా ఉత్పత్తిని పెంచాలని సూచించారు. టీకా తయారీకి ఉన్న అడ్డంకులను తొలగించాలని 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని సంస్థలు ప్రధానిని లేఖ ద్వారా కోరాయి.
టీకా సరఫరాపై మోదీకి 500 మంది ప్రముఖుల లేఖ
దేశంలో తగినంత వ్యాక్సిన్ సరఫరా ఉండేలా చూడాలని 500 మంది పౌరప్రముఖులు.. ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొనేందుకు టీకా ఉత్పత్తిని పెంచాలని సూచించారు.
నరేంద్ర మోదీ
అందరికీ వ్యాక్సిన్ అందేలా ఓ ప్రణాళికను తయారు చేయాలని ప్రధానికి విన్నవించారు. రాష్ట్రాల సమన్వయంతో, పారదర్శకతతో వ్యాక్సిన్ ప్రక్రియను చేపట్టాలని సూచించారు. అవసరమైతే వ్యాక్సిన్ను ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా అందించాలని కోరారు.