దేశంలో కరోనా టీకా డోసుల పంపిణీ 50 కోట్లు దాటినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. ఒక్కరోజే 43.29 లక్షల డోసుల పంపిణీ జరిగినట్లు వెల్లడించింది. దీంతో మొత్తం డోసుల పంపిణీ సంఖ్య.. 50,03,48,866కు చేరినట్లు పేర్కొంది. మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 17.23 కోట్ల మంది తొలి డోసు అందుకోగా.. 1.12 కోట్ల మంది రెండవ డోసు తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.
ప్రధాని హర్షం
టీకా పంపిణీలో 50 కోట్ల మైలురాయిని దాటడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిపైన పోరాడేందుకు భారత్‌కు మరింత బలం చేకూరినట్లు అయిందన్నారు. ఈ వ్యాక్సినేషన్‌ను మరింత విస్తృతం చేసి దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందేలా చర్యలు చేపడుతామని పేర్కొన్నారు.
రాష్ట్రాల్లో కరోనా కేసులు..
- మహమ్మారి ఉద్దృతి ఎక్కువగా ఉన్న కేరళలో గురువారంతో పోలిస్తే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కొత్తగా 19,948 కేసులు నమోదయ్యాయి. 19,480 మంది కోలుకోగా 187 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మహారాష్ట్రలో కొత్తగా 5,539 కేసులు నమోదుకాగా..5,859 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 187 మంది మృతిచెందారు.
- తమిళనాడులో కొత్తగా 1,985 మంది మహమ్మారి బారిన పడ్డారు. 1,908 మంది కోలుకోగా.. 30 మంది మృతిచెందారు.
- కర్ణాటకలో కొత్తగా 1,805 కరోనా కేసులు బయటపడ్డాయి. మహమ్మారి నుంచి 1,854 మంది కోలుకోగా.. 36 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఒడిశాలో కొత్తగా 1,208 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 66 మంది మహమ్మారి ధాటికి మృతిచెందారు.
- మణిపుర్లో కొత్తగా 742 మందికి కరోనా సోకగా.. 1,047 మంది కోలుకున్నారు. 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బంగాల్లో కొత్తగా 717 మందికి మహమ్మారికి సోకింది. 787 మంది కోలుకోగా.. 9 మంది మృతిచెందారు.
ఇదీ చదవండి :భారత్‌కు 'ఈటా' వైరస్- దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తిలో...