దేశంలో వ్యాక్సినేషన్ ఊపందుకుంటోంది. ఇప్పటివరకు టీకా తీసుకున్న వారి సంఖ్య 41 లక్షల 20 వేలు దాటినట్లు వెల్లడించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. తొలి విడతలో భాగంగా భారత్లో కరోనాపై పోరులో ముందుండి పోరాడిన ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ ఇస్తున్నారు.
బంగాల్, గుజరాత్లో మంగళవారం నుంచే వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఒక్కరోజే రెండు రాష్ట్రాల్లోని దాదాపు 20 వేల ఫ్రంట్లైన్ వర్కర్లకు టీకా ఇచ్చారు. మొత్తంగా మంగళవారం.. దేశవ్యాప్తంగా లక్షా 70 వేల మందికిపైగా లబ్ధిదారులు టీకా పొందినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.