పార్లమెంట్‌లో కరోనా కలకలం- 350 మందికి పాజిటివ్ - దేశంలో కరోనా కేసులు
![పార్లమెంట్‌లో కరోనా కలకలం- 350 మందికి పాజిటివ్ corona in parliament](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14134422-thumbnail-3x2-parliament.jpg)
19:49 January 08
పార్లమెంట్‌లో కరోనా కలకలం- 350 మందికి పాజిటివ్
Parliament Corona: దేశవ్యాప్తంగా పెద్దఎత్తున కరోనా కేసులు నమోదవుతున్న వేళ పార్లమెంట్‌లో కూడా కరోనా కలకలం రేపింది. రెండ్రోజులుగా పార్లమెంటు సిబ్బందికి నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో 350 మందికిపైగా కరోనా పాజిటివ్ అని తేలింది.
ముంబయిలోని సీబీఐ కార్యాలయంలో కూడా పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదయ్యాయి. బాంద్రా- కుర్లా కాంప్లెక్స్‌లోని కార్యాలయంలో మొత్తం 235 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా 68 మందికి పాజిటివ్ వచ్చింది. వైరస్ బారిన పడినవారు హోం క్వారంటైన్లో ఉంటారని అధికారులు వెల్లడించారు.