కరోనా మూడో దశ ముప్పును ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయి. ఇలాంటి సమయంలో 31,124 ఆందోళనకర కరోనా వేరియంట్లను (variant of concern) గుర్తించింది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జీనోమ్ కన్సార్టియం(ఐఎన్ఎస్ఏసీఓజీ-ఇన్సాకాగ్).
దేశవ్యాప్తంగా జరిపిన జీనోమ్ సీక్వెన్సింగ్‌లో వీటిని గుర్తించారు. ఇందులో 4,227 ఆల్ఫా, 219 బీటా, 2 గామా, 21,192 డెల్టా, 5,417 బి.1.1617.1, బి.1.617.3 వేరియంట్లున్నాయి.
ప్రస్తుతానికి భారత్‌లో డెల్టానే ప్రధాన ఆందోళనకర వేరియంట్‌గా ఉందని నిపుణులు తెలిపారు. చాలా రాష్ట్రాల్లో వెలుగుచూస్తున్న ఏవై.12 కేసులకు డెల్టాతో మాలిక్యులర్ స్థాయిలో దగ్గరి సంబంధం కనిపిస్తోందని చెప్పారు. అయిత్ వాటి ప్రభావంలో తేడాలను అంచనా వేయాల్సి ఉందని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు.