అసోంలోని కరీంగంజ్ జిల్లాలో (Karimganj News) ప్రమాదం చోటుచేసుకుంది. నదిపై వేలాడే వంతెన కూలిపోవడం వల్ల 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. రాటాబరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చెరాగి ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చెరాగి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే సింగ్లా నదిపై ఉన్న ఈ వేలాడుతున్న వంతెనను దాటాల్సి ఉంటుంది. ఈ నది చెరాగి ప్రాంతాన్ని అక్కడి గ్రామంతో కలుపుతుంది. అయితే, కొన్నేళ్లుగా విద్యార్థులు, ప్రజలు పాఠశాలలకు.. ఇతర ప్రాంతాలకు ఇదే వంతెన నుంచి వెళ్తున్నారు.
వేలాడే వంతెన కూలి 30మంది విద్యార్థులకు గాయాలు!
అసోంలోని కరీంగంజ్ జిల్లాలో (Karimganj News) వంతెన కూలి 30 మంది విద్యార్థులు గాయపడ్డారు. చెరాగ్లోని సింగ్లా నదిని దాటేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ క్రమంలో సోమవారం చెరాగి విద్యాపీఠ్ హైస్కూల్ విద్యార్థులు ఇంటికి వెళ్లేందుకు సింగ్లా నదిని (Karimganj News) దాటేందుకు ప్రయత్నించగా.. అది అకస్మాత్తుగా కూలిపోవడం వల్ల అనేకమంది విద్యార్థులు నదిలో పడిపోయినట్టు సమాచారం. సమాచారం అందుకున్న స్థానికులు అక్కడికి చేరుకొని విద్యార్థులను కాపాడారు. ఈ ఘటనలో దాదాపు 30మంది విద్యార్థులు గాయపడగా.. వారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ వేలాడే వంతెనను మూడేళ్ల క్రితమే నిర్మించినట్టు గ్రామస్థులు తెలిపారు.
ఇదీ చూడండి :'రేపటిలోగా ప్రియాంకను విడుదల చేయలేదో'.. సిద్ధూ వార్నింగ్!