తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Vaccination: భారత్​లో టీకా పంపిణీ  @25కోట్లు

కరోనా టీకా డోసుల పంపిణీలో భారత్​ కీలక మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు 25 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 20కోట్ల 46 లక్షల పైచిలుకు మందికి మొదటి డోసును అందించినట్లు పేర్కొంది.

VACCINE-HEALTH MINISTRY
టీకా డోసుల పంపిణీ

By

Published : Jun 13, 2021, 6:18 AM IST

Updated : Jun 13, 2021, 6:33 AM IST

దేశవ్యాప్త టీకా పంపిణీ(Vaccination in India) కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ అందించిన డోసుల సంఖ్య 25,28,78,702కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ(Union Health Ministry) పేర్కొంది. శనివారం ఒక్కరోజే మొత్తం 31లక్షల 67వేల 961 వ్యాక్సిన్ డోసులు అందించినట్లు వివరించింది.

వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇలా..

  • 20 కోట్ల 46లక్షల పైచిలుకు మందికి మొదటి డోసుల పంపిణీ చేశారు.
  • 18-44 మధ్య వయస్సుల వారిలో 18,45,201 మంది మొదటి డోసును, 1,12,633 మందికి రెండో డోసును అందుకున్నారు.
  • బిహార్, దిల్లీ, గుజరాత్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, ఉత్తర్​ప్రదేశ్, బంగాల్ రాష్ట్రాల్లో 10లక్షలకు పైగా లబ్ధిదారులు(18-44) మొదటి డోసును తీసుకున్నారు.
  • మొదటి డోసు తీసుకున్న ఆరోగ్య సిబ్బంది: 1,00,47,057, రెండో డోసు తీసుకున్నవారు: 69,62,262
  • మొదటి డోసు పొందిన పారిశుద్ధ్య కార్మికులు 1,67,20,729 కాగా.. 88,37,805 మంది రెండో డోసు కూడా తీసుకున్నారు.
Last Updated : Jun 13, 2021, 6:33 AM IST

ABOUT THE AUTHOR

...view details