బంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో ప్రధాన పార్టీలు పొత్తులు, సీట్ల పంపకాలపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ క్రమంలో పార్టీలు తమ అభ్యర్థులను విడతల వారీగా ప్రకటించేందుకు సమాయత్తమవుతున్నాయి. అయితే అనూహ్యంగా 294సీట్లకు గానూ.. 291 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది అధికార తృణమూల్ కాంగ్రెస్ అశ్చర్యపరిచింది. మరో 3 స్థానాలను తమ కూటమి పార్టీ 'గోర్ఖా జన్ముక్తి మోర్చా'(జీజేఎం)కు వదిలేసింది. అయితే.. తాజాగా విడుదల చేసిన జాబితాలో 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు పేర్లు లేకపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే వేరు వేరు కారణాలతో వారే పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎన్నికల బరి నుంచి తప్పుకున్న వారిలో కీలక నేతలు.. రాష్ట్ర ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా, రెవెన్యూ మంత్రి అబ్దుల్ రజాక్ మొల్లా, వ్యవసాయ శాఖ మంత్రి పుర్నేందు బసులు ఉండటం గమనార్హం. వయసు పైబడటం, కొవిడ్-19 మహమ్మారి ముప్పు కొనసాగుతుండటం వల్లే వారు తమ అభ్యర్థిత్వం నుంచి తప్పుకోవడానికి కారణమని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. భవిష్యత్తు ఎన్నికల్లో తాను తిరిగి పోటీ చేస్తానని తెలిపారు మిత్రా. ప్రస్తుత మహమ్మారి సమయంలో రిస్క్ తీసుకోదలుచుకోలేదని, అందుకే ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు.
ఆ మంత్రుల స్థానాల్లో ఎవరు?
- ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఖర్దాహా నియోజకవర్గం నుంచి గెలిచిన మిత్రా స్థానంలో.. కాజల్ సిన్హాకు టికెట్టు ఇచ్చింది అధికార పార్టీ.
- దక్షిణ 24 పరగణాల జిల్లా భంగర్ నియోజకవర్గంలో రజాక్ మొల్లా స్థానాన్ని.. మొహమ్మద్ రెజౌల్ కరీమ్‌తో భర్తీ చేయనున్నారు.
- ఉత్తర 24 పరగణాల జిల్లాలోని రాజాఘాట్ గోపాల్‌పుర్ నుంచి బసు స్థానంలో అదితి మున్షికి టికెట్టు ఇచ్చారు.
పోటీలో కీలక నేతలు..