దేశంలో ప్రజలకు ఇప్పటివరకు అందించిన కరోనా డోసుల సంఖ్య 20 కోట్ల మార్కును దాటిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 20 కోట్ల 25 లక్షల 29వేల 884 మందికి టీకా అందించినట్లు తెలిపింది. బుధవారం ఒక్కరోజే 18 నుంచి 44 ఏళ్ల మధ్య గల 8 లక్షల 31 వేల 500 మందికి కొవిడ్ టీకా మొదటి డోసు లభించిందని కేంద్ర ప్రభుత్వం వివరించింది.
vaccination: 20 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ - కరోనా డోసులు పంపిణీ
కరోనా డోసుల పంపిణీలో(vaccination) భారత్ కీలక మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు 20 కోట్ల డోసులను(vaccine doses) పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (health ministry) తెలిపింది.
'దేశంలో 20కోట్లు దాటిన కరోనా డోసుల పంపిణీ'
బుధవారం ఒక్కరోజే మొత్తం 17 లక్షల 19 వేల 931 వ్యాక్సిన్ డోసులు అందించామని వివరించింది. మే 1న ప్రారంభమైన మూడో దశ టీకా డ్రైవ్‌లో(vaccination) దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోటీ 38 లక్షల 62 వేల 428 మందికి కరోనా టీకా ఇచ్చినట్లు పేర్కొంది. 98 లక్షలమందికిపైగా ఆరోగ్య కార్యకర్తలు మొదటి డోసు టీకా తీసుకోగా.. 67 లక్షల మందికిపైగా రెండో డోసు తీసుకున్నారు.
ఇదీ చూడండి:తమిళనాడులో కరోనా ఉద్ధృతి- మరో 33వేల కేసులు
Last Updated : May 27, 2021, 7:36 AM IST