బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల్లేకుండా తిరిగిన వారిలో గతేడాది ఏప్రిల్ నుంచి ఈ నెల 15వరకు.. సుమారు 15లక్షల మందిని గుర్తించారు మహారాష్ట్రలోని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. వారి నుంచి జరిమానాల రూపంలో సుమారు రూ.30 కోట్లకుపైగా వసూలు చేసినట్టు చెప్పారు.
బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకుండా తిరిగితే రూ.200 జరిమానా విధిస్తున్నారు అధికారులు. అలా.. సోమవారం(ఈ నెల 15న) ఒక్కరోజే దాదాపు 13 వేల మంది నుంచి రూ.26,01,600 జరిమానా రూపంలో వసూలు చేశారు. ఈ రకంగా 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 15వరకు.. ముంబయి నగరంలో 15.16 లక్షల మందిని గుర్తించి 30.69 కోట్లు రాబట్టినట్టు తెలిపారు.