Goondas arrested in Kerala: సుమారు 20 రోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా 13వేల మంది గూండాలను అరెస్టు చేశారు కేరళ పోలీసులు. గతేడాది డిసెంబర్ 18 నుంచి ఈ ఏడాది జనవరి 9 వరకు ఈ అరెస్టులు జరిగాయి. సంఘ విద్రోహక శక్తుల అణచివేతలో భాగంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నారు పోలీసులు.
2021 డిసెంబర్ ఆరంభంలో అలప్పుజలో ఎస్డీపీఐ సహా ఓ భాజపా నేత గంటల వ్యవధిలో హతమయ్యారు. దాంతోపాటు కేరళ వ్యాప్తంగా పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే గూండాలపై ఉక్కుపాదం మోపారు పోలీసులు.