తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యాక్టివ్​ కేసుల్లో 75 శాతం ఆ రెండు రాష్ట్రాల్లోనే - కేంద్ర ఆరోగ్య శాఖ

దేశంలో కరోనా యాక్టివ్​ కేసుల్లో 75 శాతం మహారాష్ట్ర, కేరళల్లోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం నాటికి 1.48 కోట్ల టీకా డోసులు అందించినట్లు పేర్కొంది. కొవిన్​ పోర్టల్లో రిజిస్ట్రేషన్​ చేసుకున్న వారి సంఖ్య 50 లక్షలు దాటిందని వెల్లడించింది.

Over 1.48 cr COVID-19 vaccine doses administered in country, says Health Ministry
దేశవ్యాప్తంగా 1.48 కోట్ల మందికి వ్యాక్సినేషన్​

By

Published : Mar 2, 2021, 7:32 PM IST

దేశంలో మంగళవారం ఒంటి గంట వరకు సుమారు 1.48 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే 45 నుంచి 59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులతో భాధపడేవారికి, 60ఏళ్ల పైబడిన వారికి 2.08లక్షల డోసులు ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్​ భూషణ్​ తెలిపారు.

దేశంలోని కరోనా యాక్టివ్​ కేసుల్లో 75 శాతం మహారాష్ట్ర, కేరళల్లోనే ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. భారత్​లో మిలియన్​ జనాభాకు సగటున 113 మరణాలు నమోదవుతున్నాయని, ప్రతి 10 లక్షల జనాభాలో లక్షా 57 వేలమందికిపైగా టెస్టులు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.

తమిళనాడు, పంజాబ్​లలో కొవిడ్​ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో.. వైరస్​ను అదుపులోకి తెచ్చేందుకు ప్రత్యేక వైద్య బృందాలను నియమించినట్టు భూషణ్​ వివరించారు. వీటితో పాటు హరియాణాను కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారాయన.

50 లక్షల మంది రిజిస్ట్రేషన్​..

టీకా కోసం పేర్ల నమోదుకు తీసుకొచ్చిన కొవిన్​ పోర్టల్​లో ఇప్పటివరకు రిజిస్ట్రేషన్​ వారి సంఖ్య 50 లక్షలు దాటిందని కేంద్రం పేర్కొంది.

ఇదీ చదవండి:ఒకే పాఠశాలలో 54 మంది విద్యార్థులకు కరోనా

ఇదీ చదవండి:టీకాపై అసత్య ప్రచారానికి ట్విట్టర్​ బ్రేకులు!

ABOUT THE AUTHOR

...view details