తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అవును! మాది ఈడీ ప్రభుత్వమే.. నన్ను ట్రోల్ చేసినవారిని..'.. ఫడణవీస్ విక్టరీ స్పీచ్ - మహారాష్ట్ర ఈడీ రాజకీయం

Maharashtra ED government: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు! తమది ఈడీ ప్రభుత్వమేనంటూ వ్యాఖ్యానించారు. అయితే 'ఈడీ' అంటే అర్థం ఏక్​నాథ్- దేవేంద్ర ప్రభుత్వమని వివరణ ఇచ్చారు.

ED government
ED government

By

Published : Jul 4, 2022, 1:57 PM IST

Updated : Jul 4, 2022, 2:19 PM IST

Fadnavis ED government: భాజపా సర్కారు విపక్షాలపైకి ఈడీ(ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​)ని ఉసిగొల్పుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమది ఈడీ ప్రభుత్వమేనన్న ఆయన.. దాని అర్థం 'ఏక్​నాథ్- దేవేంద్ర' ప్రభుత్వంగా అభివర్ణించారు. ఇరువురి పేర్లలోని తొలి ఆంగ్ల అక్షరాన్ని సూచిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంలో అధికారం కోసం పోరాటాలు ఉండవని అన్నారు. సహకారంతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో విజయం సాధించిన అనంతరం ఆయన ప్రసంగించారు.

Maharashtra Assembly Fadnavis:
"2019 ఎన్నికలకు ముందు 'నేను తిరిగి వస్తాను' అని నేను నినాదం ఇచ్చాను. దానిపై చాలా మంది ట్రోల్ చేశారు. ట్రోల్ చేసిన వారిని క్షమిస్తున్నా. వారిపై నేను ప్రతీకారం తీర్చుకోను. బలపరీక్ష ఓటింగ్ సమయంలో విపక్ష ఎమ్మెల్యేలు 'ఈడీ, ఈడీ' అని అరుస్తున్నారు. అవును కొత్త ప్రభుత్వం ఈడీ ప్రభుత్వమే. 'ఈడీ'నే ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈడీ అంటే అర్థం 'ఏక్​నాథ్, దేవేంద్ర'. గత ఎన్నికల్లో మా కూటమికి ప్రజలు మెజారిటీ ఇచ్చారు. మధ్యలో దాన్ని కొంతమంది లాగేసుకున్నారు. కానీ ఏక్​నాథ్ శిందేతో కలిసి మేం మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేశాం. నిజమైన శివసైనికుడు సీఎం అయ్యారు. నా పార్టీ ఆదేశించకపోతే నేను ప్రభుత్వం వెలుపలే ఉండేవాడిని. నన్ను సీఎంను చేసిన పార్టీ కోరడం వల్లే ప్రభుత్వంలో చేరాను."
-దేవేంద్ర ఫడణవీస్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి

ఇదివరకు రాష్ట్రంలో నాయకత్వ సంక్షోభం ఉండేదని ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు ఫడణవీస్. ఇకపై తాను, శిందే ప్రజలకు అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. మరోవైపు, ఔరంగాబాద్ పేరు మారుస్తూ గత కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తామని చెప్పారు. 'గత కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు మాకు ఆమోదయోగ్యమైనవే. కానీ వాటిని నిబంధనల ప్రకారం తీసుకోలేదు. అప్పటికే బలపరీక్ష చేపట్టాలని గవర్నర్ ఆదేశించారు. వాటిని మరోసారి పరిశీలించి నిర్ణయం వెలువరిస్తాం' అని ఫడణవీస్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

Last Updated : Jul 4, 2022, 2:19 PM IST

ABOUT THE AUTHOR

...view details