తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆత్మనిర్భర్ భారత్​ లక్ష్యం అదే: వెంకయ్య - vice president venkaiah naidu Aatmanirbhar Bharat

భారతదేశం ఎన్నో సంక్షోభాలను ఐక్యంగా ఎదుర్కొందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆత్మనిర్భర్ అంటే భారత్​లో తయారీ మాత్రమే కాదని, దేశంలోని ప్రతి పౌరుని జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడమే దాని లక్ష్యమని తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

Our goal of Aatmanirbhar Bharat will be further strengthened by self-reliance in agriculture: VP
ఆత్మనిర్భర్ భారత్​ లక్ష్యం అదే: వెంకయ్య

By

Published : Jan 29, 2021, 1:19 PM IST

కరోనా కష్టాలను దేశం సంఘటితంగా అధిగమించిందని చెప్పారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. భారత్​ ఎన్నో కష్టాలను ఐక్యంగా ఎదుర్కొందన్నారు. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్​ ప్రక్రియ దేశంలో జరుగుతోందని తెలిపారు. రెండు వ్యాక్సిన్లను దేశీయంగా రూపొందించామని చెప్పారు.

పార్లమెంటు బడ్జెట్​ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి వెంకయ్య నాయుడు ప్రసంగించారు. ఆత్మనిర్మర్ భారత్​ అంటే దేశంలో తయారీకి మాత్రమే పరిమితం కాదన్నారు. ప్రతి పౌరుని జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచి, వ్యవసాయం రంగంలో స్వావలంబన సాధించడమే ఆత్మనిర్భర్ భారత్​ లక్ష్యమని తెలిపారు.

దేశానికి అన్నం పెట్టే రైతుల సేవలు మరువలేనివని, రైతుల కృషి కారణంగా దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని వెంకయ్య చెప్పారు. 2019-20 సంవత్సరంలో 296 మిలియన్ టన్నుల ఆహారధాన్యాలు ఉత్పత్తి చేశారని, రికార్డుస్థాయిలో ఆహారధాన్యాలు ఉత్పత్తి చేసిన రైతులకు అభినందనలు తెలియజేశారు.

ఇదీ చూడండి: '2020లో 4-5 మినీ బడ్జెట్‌లు ప్రవేశపెట్టాం'

ABOUT THE AUTHOR

...view details