తెలంగాణ

telangana

By

Published : Aug 3, 2021, 11:09 AM IST

ETV Bharat / bharat

రాహుల్​గాంధీ ఆధ్వర్యంలో విపక్ష నేతల భేటీ

పార్లమెంట్​ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విపక్ష నేతలు చర్చలు జరిపారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆహ్వానం మేరకు పలు పార్టీల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

rahul gandhi, leaders
రాహుల్ గాంధీ, విపక్ష నేతలు

పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విపక్ష నాయకులు విస్తృతంగా చర్చించారు. అల్పాహార సమావేశం పేరుతో దిల్లీ కానిస్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేత రాహుల్‌ నేతృత్వంలో విపక్ష నేతలు సమావేశమై ఉభయ సభల్లో అనుసరించాల్సిన వైఖరిపై సమాలోచనలు జరిపారు. సభలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై చర్చించారు.

రాహుల్​ గాంధీ పిలుపు మేరకు అల్పాహార సమావేశం
విపక్ష నేతల భేటీ

ఈ సమావేశానికి కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఆరెస్పీ, జేఎంఎం, నేషనల్ కాన్ఫరెన్స్‌, తృణమూల్ కాంగ్రెస్‌ నేతలు హాజరయ్యారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ మాత్రం ఈ సమావేశానికి హాజరుకాలేదు. విపక్ష పార్టీలన్నీ ఒక గళాన్ని వినిపించాలనేది తన ఉద్దేశమని ఈ సందర్భంగా రాహుల్ వ్యాఖ్యానించారు. అంతా ఏకతాటిపైకి వస్తే శక్తివంతమైన గొంతుగా మారుతుందన్నారు. అప్పుడు విపక్షాల గొంతు నొక్కడం భాజపా-ఆరెస్సెస్‌కు కష్టంగా మారుతుందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:'పెగసస్​'పై ఆగని రగడ- నిరసనల మధ్యే బిల్లులకు ఆమోదం

ABOUT THE AUTHOR

...view details