తెలంగాణ

telangana

ETV Bharat / bharat

INDIA, NDA మధ్య పోరాటం ఇది : రాహుల్​ - OPPOSITION MEETING

OPPOSITION MEETING
OPPOSITION MEETING

By

Published : Jul 18, 2023, 10:52 AM IST

Updated : Jul 18, 2023, 4:50 PM IST

16:43 July 18

  • భాజపా విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉంది : రాహుల్‌ గాంధీ
  • దేశంలో నిరుద్యోగం పెచ్చుమీరుతోంది
  • దేశంలోని మొత్తం ధనం ఎన్నికైన నేతల చేతుల్లోకి వెళ్తోంది
  • భాజపాకు వ్యతిరేకంగా విపక్షాల పోరాటంగా భావించవద్దు
  • దేశ ప్రజల గొంతుకను అణచివేతపై పోరాటంగా భావించాలి
  • ఐ.ఎ.న్‌.డి.ఐ.ఎ, ఎన్డీఏ మధ్య పోరాటం ఇది
  • నరేంద్ర మోదీ, ఐ.ఎ.న్‌.డి.ఐ.ఎ మధ్య పోరాటం ఇది


16:38 July 18

  • తొమ్మిదేళ్ల భాజపా పాలనలో ప్రతి రంగాన్ని నాశనం చేశారు: కేజ్రీవాల్‌
  • రైల్వే, విమానాశ్రయాలను, ఓడరేవులను అమ్మకానికి పెట్టారు: కేజ్రీవాల్‌
  • యువత, రైతులు, వ్యాపారులందరూ బాధపడుతున్నారు: కేజ్రీవాల్‌
  • భారత కలలను అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది: కేజ్రీవాల్‌
  • యువతకు ఉపాధి, ప్రజలకు వైద్యం అందాల్సి ఉంది: కేజ్రీవాల్‌

16:34 July 18

  • వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలను భాజపా ప్రభుత్వం వేధిస్తోంది: మమతా బెనర్జీ
  • వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చడంపైనే భాజపా దృష్టి: మమతా బెనర్జీ
  • దేశ ప్రజల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి: మమతా బెనర్జీ
  • విపత్తు నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సి ఉంది: మమతా బెనర్జీ
  • దేశంతో పాటు దేశ ప్రజలను కాపాడుకోవాల్సి ఉంది: మమతా బెనర్జీ
  • కేంద్ర దర్యాప్తు సంస్థలను స్వతంత్రంగా పనిచేయనీయట్లేదు: మమత
  • విమర్శిస్తే విపక్షాలపై ఎక్కుపెడుతున్నారు: మమతా బెనర్జీ
  • భారత్‌ గెలుస్తుంది.. భాజపా ఓడుతుంది: మమతా బెనర్జీ

16:16 July 18

విపక్ష కూటమికి 'ఇండియా'గా నామకరణం చేశాయి ప్రతిపక్షాలు. ఇండియన్‌ నేషనల్ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయెన్స్‌గా పేరు పెట్టామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వెల్లడించారు. విపక్ష కూటమి పేరుకు అన్ని పార్టీల నేతలు అంగీకరించారని తెలిపారు. 11 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. విపక్ష కూటమి తదుపరి సమావేశం ముంబయిలో నిర్వహిస్తామని ప్రకటించారు. విపక్షాల భేటీలో 26 పార్టీల నాయకులు భేటీ అయ్యారని.. తమకు ప్రజాస్వామ్య పరిరక్షణ చాలా ముఖ్యమన్నారు. పట్నా భేటీలో 16 పార్టీలు సమావేశమైతే మంగళవారం భేటీకి 26 పార్టీలు హాజరయ్యాయన్నారు. ఎన్​డీఏ భేటీలో 30 పార్టీలు సమావేశమైనట్లు ప్రచారం చేస్తున్నారని.. ఈసీ గుర్తించిన పార్టీలు వచ్చాయా? లేదా? అనేది తెలియదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవాల్సి ఉందని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పాలనపై అందరూ విసిగిపోయారని.. పోరాటంలో విజయం సాధిస్తామనే నమ్మకం ఉందన్నారు.

15:07 July 18

Congress new alliance name : టీమ్ INDIA వర్సెస్ టీమ్​ NDA

Opposition alliance name : 26 పార్టీలతో కూడిన విపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టే అవకాశముంది. ఈ పేరు ఇంకా పూర్తిగా ఖరారు కాకపోయినా.. అత్యధిక మంది నేతలు అంగీకరించినట్లు తెలిసింది. సాయంత్రం అధికారిక ప్రకటన రావచ్చని సమాచారం.
INDIA అంటే ఇండియన్ నేషనల్ డెమొక్రటిక్ ఇన్​క్లూజివ్ అలయెన్స్ అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

13:59 July 18

విపక్షాల సమావేశం నిర్మాణాత్మకంగా జరిగిందని బంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఈ భేటీ ఫలితాలు దేశానికి మంచి చేస్తాయని చెప్పారు. పదేళ్ల కాలంలో ప్రధాని మోదీ.. అన్ని రంగాలను నాశనం చేశారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆయనను గద్దెదించే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. దేశంలో జరుగుతున్న తప్పులన్నింటికీ వ్యతిరేకంగా నిలబడటం చాలా ముఖ్యమని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. దేశంలో రాజ్యాంగాన్ని క్రమంగా నాశనం చేస్తున్నారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వ హయాంలో అన్నింటినీ నాశనం చేశారని బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ధ్వజమెత్తారు. 'దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడాలి. పేదలు, యువత, రైతులు, మైనారిటీలను సంరక్షించాలి' లాలూ పేర్కొన్నారు.

12:46 July 18

విపక్ష కూటమిలోని వివిధ పార్టీల మధ్య రాష్ట్రస్థాయుల్లో విభేదాలు ఉన్నాయని, అయితే అవి అంత పెద్దవి కాదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. వాటిని పక్కనబెట్టి ప్రజల కోసం తాము పనిచేసేందుకు ముందుకు సాగుతామని ఖర్గే పేర్కొన్నారు. విపక్షాల సమావేశంలో భాగంగా మాట్లాడిన ఆయన.. తమ మధ్య భావజాల వైరుధ్యాలు లేవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి పదవిపై ఆసక్తి లేదని అన్నారు.

'మా కూటమిలో 26 పార్టీలు ఉన్నాయి. 11 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. బీజేపీకి 303 సీట్లు స్వయంగా రాలేదు. మిత్రపక్షాల ఓట్లను ఉపయోగించుకొని వారిని దూరం పెట్టింది. ఇప్పుడేమో బీజేపీ అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలు పాత స్నేహితులతో జతకట్టేందుకు అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నారు. కాంగ్రెస్​కు అధికారం, ప్రధాని పదవిపై ఆసక్తి లేదు. అధికారం సంపాదించడం మా ఉద్దేశం కాదు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని, సామాజిక న్యాయాన్ని రక్షించడమే మా లక్ష్యం' అని ఖర్గే వ్యాఖ్యానించారు.

12:40 July 18

'మా మధ్య విభేదాలు ఉన్నాయి కానీ..'
విపక్ష కూటమిలోని వివిధ పార్టీల మధ్య రాష్ట్రస్థాయుల్లో విభేదాలు ఉన్నాయని, అయితే అవి అంత పెద్దవి కాదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. వాటిని పక్కనబెట్టి ప్రజల కోసం తాము పనిచేసేందుకు ముందుకు సాగుతామని ఖర్గే పేర్కొన్నారు. విపక్షాల సమావేశంలో భాగంగా మాట్లాడిన ఆయన.. తమ మధ్య భావజాల వైరుధ్యాలు లేవని స్పష్టం చేశారు.

11:58 July 18

బీజేపీని ఎదుర్కొనే ప్లాన్​పై విపక్ష కూటమి చర్చలు జరుపుతోంది. ఈ మేరకు బెంగళూరులో రెండోరోజు సమావేశమైన 26 పార్టీల నేతలు.. సమాలోచనలు జరుపుతున్నారు. కూటమి పేరు, బీజేపీని కట్టడి చేసే వ్యూహాలపై చర్చిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్​లో నేతలు మాట్లాడనున్నారు.

11:55 July 18

విపక్షాల సమావేశం కోసం వివిధ పార్టీల నేతలంతా బెంగళూరులోని తాజ్ హోటల్​కు చేరుకుంటున్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశానికి విచ్చేశారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్​లు హోటల్​కు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఫేర్​వెల్ చెప్పాల్సిన సమయం వచ్చిందంటూ ఈ సందర్భంగా లాలూ ప్రసాద్ వ్యాఖ్యానించారు.
బంగాల్ సీఎం మమత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సైతం భేటీ జరిగే చోటుకు చేరుకున్నారు.

10:45 July 18

విపక్షాల భేటీకి శరద్ పవార్.. సోనియాకే కూటమి పగ్గాలు!

బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న లక్ష్యంతో విపక్షాలు ఏకమవుతున్నాయి. ఇందుకు సంబంధించి బెంగళూరులో రెండో రోజూ విపక్షాల సమావేశం జరగనుంది. ఇటీవల పట్నాలో తొలి విడత సమావేశంలో పాల్గొన్న విపక్ష నేతలు... రెండో విడతగా సోమవారం బెంగళూరులో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ సమావేశానికి ఎన్సీపీ అగ్రనేత శరద్‌ పవార్‌ మినహా ఆహ్వానాలు అందుకున్న మిగతా విపక్ష నేతలంతా హాజరయ్యారు. రెండోరోజు సమావేశాల్లో లాంఛనప్రాయమైన చర్చలకు ఎజెండాగా ఏయే అంశాలు ఉండాలనేది నేతలు తొలిరోజు భేటీలో స్థూలంగా మాట్లాడుకున్నారు. కాగా, రెండో రోజు సమావేశానికి ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్ హాజరవుతున్నారు. ఆయన ఇప్పటికే ముంబయి చేరుకున్నారు. కాసేపట్లో చర్చలు ప్రారంభం కానున్నాయి. కాగా.. విపక్షాల కూటమిలో యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీకి కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Last Updated : Jul 18, 2023, 4:50 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details