పెగసస్ వ్యవహారాన్ని సూచిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రతి ఒక్క భారతీయుడి ఫోన్ని కేంద్ర ట్యాప్ చేసిందని ఆరోపించారు. పెగసస్పై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత వర్షకాల సమావేశాల్లో పెగసస్పై చర్చ చేపట్టకపోవటంపై ప్రశ్నించారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద అన్నదాతలు ఆందోళన చేస్తున్న ప్రాంతానికి వెళ్లి సంఘీభావం తెలిపాయి 14 విపక్ష పార్టీలు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై విమర్శలు చేశారు రాహుల్.
" సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతు పలికేందుకు ఈరోజు విపక్ష పార్టీలన్నీ జంతర్ మంతర్ వద్దకు వచ్చాయి. పెగసస్పై చర్చ చేపట్టాలని మనం కోరుతుంటే, కేంద్ర అందుకు సుముఖంగా లేదు. ప్రతి ఒక్క భారతీయుడి ఫోన్ను నరేంద్ర మోదీ ట్యాప్ చేశారు. "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత.